Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

PV Sindhu: పారిస్ ఒలింపిక్స్ నుంచి పీవీ సింధు నిష్క్రమణ

PV Sindhu: ప్రజా దీవెన పారిస్: పారిస్ ఒలింపిక్స్ లో ఏదొక పతకం సాధిస్తుందని పి.వి సింధుపై (PV Sindhu)గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఈసారి హ్యాట్రిక్ కొడుతుందని అంతా ఊహించారు. కానీ సింధు (PV Sindhu)ఓడింది. పోరాడి ఓడింది. క్వార్టర్స్ చేరు కుండానే ఒలింపిక్స్ నుంచి ఇంటిబాటపట్టింది. గురువారం బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ (Women’s Singles Prequarters) లో ఆమె 19-21, 14-21తో చైనా క్రీడాకారిణి హే బిన్ జియావో చేతిలో ఘోరంగా ఓడింది. తొలిగేమ్ ను గెలిచే ఛాన్స్ సింధు చేజార్చుకుంది. ఆ తర్వాత ముందుకు సాగలేక పొఇంది. మ్యాచ్ ఆరంభంలో 1-5 తేడాతో వెనకబడ్డ సింధు (PV Sindhu)..మళ్లి ఎంత ప్రయత్నించినా..ప్రత్యర్థి ఆమెకు ఆధిక్యం సాధించే ఛాన్స్ ఇవ్వలేదు.

అయితే 19-19 స్కోరుతో సమం కావడంతో సింధకు మంచి ఛాన్స్ లభించింది. కానీ ప్రత్యర్థికి రెండు పాయింట్లు ఇచ్చింది. దీంతో గేమ్ (game) ను కోల్పోవాల్సి వచ్చింది. ఆధిక్యం లోకి వెళ్లిన ఆనందంలో బిన్ జి యానో రెండో గేమ్ లో సత్తా చాటింది. 13-5 తో ఆధిక్యంతో దూసు కెళ్లింది. ఇక సింధు (PV Sindhu) పుంచు కోవడం కష్టంగా మారింది. ప్రత్యర్థి అదే ఊపులో ఆడింది. ఈ దశలో సింధు మూడు పాయింట్లు సాధించినా..వెంటనే ప్రత్యర్థి రెండు పాయింట్లు గెలిచి మ్యాచ్ ను సొంతం చేసు కుంది.టోక్కోలో బిన్ జియావో (Bin Xiao)ను ఓడించిన సింధు (PV Sindhu) కాంస్యం గెలిచింది.