Praja Deveena
Newspaper Banner
Date of Publish : 24 February 2026, 11:09 am Posted by : praja deveena

Nalgonda SP Sharath Chandra Pawar: స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 విజేతలకు ఎస్పీ అభినందనలు 

Nalgonda SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: తెలం గాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో మెడల్స్ సాధించి న సిబ్బందిని నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.4వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గే మ్స్ మీట్ – 2026 పోటీలు ఫిబ్రవ రి 16 నుండి 21 వరకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం మరి యు సైబరా బాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వ హించబడ్డాయి. ఈ క్రీ డా పోటీలలో నల్లగొండ జిల్లా పోలీస్ శాఖకు చెందిన సిబ్బంది వి శే ష ప్రతిభ కనబరిచి పలు వి భాగాల్లో మెడల్స్ సాధించి జిల్లా పోలీస్ శాఖకు గౌరవం తీ సుకువచ్చారు.

ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో గౌరవ నీ యులు నల్లగొండ జిల్లా ఎస్పీ మెడల్స్ సాధించిన సిబ్బందిని అభినందిస్తూ, వా రి కి మెడల్స్ అందజేశారు. విధులతో పా టు క్రీడల్లోనూ ప్రతిభ చూపు తూ శాఖకు మంచి పేరు తీ సుకువచ్చినందుకు సిబ్బందిని ప్రశంసించారు. భవిష్య త్తు లో జాతీయ స్థా యి పోటీల్లో కూడా మరింత ప్రతిభ కనబ రచాలని ఆకాంక్షించారు.

యాదాద్రి జోన్-V పరిధిలోని వివిధ విభాగాలకు చెందిన సి బ్బంది ఈ క్రీ డా పోటీలలో పాల్గొని పలు మెడల్స్ సాధిం చడం విశేషం. ఈ కార్య క్రమంలో ఏ.ఆర్. డీఎస్పీ శ్రీనివాసు లు, సీఐలు రాము, ఆది రెడ్డి, నాగ రాజు, ఆర్.ఐలు శ్రీని వాస్, సంతో ష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.