Sports Quiz Competitions : ప్రజా దీవేన , కోదాడ : భారత కేంద్ర క్రీడల మంత్రిత్వశాఖ మరియు భారతీయ క్రీడా ప్రాధికార సంస్థ సంయుక్తంగా జాతీయ స్థాయిలో గురువారం ఫిట్ ఇండియా ఫైనల్ పోటీలు ఆన్లైన్ లో నిర్వహించడం జరిగింది. దేశవ్యాప్తంగా రాష్ట్ర స్థాయిలో విజేతలైన (32) జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. తేజ విద్యాలయ 10వ తరగతి విద్యార్థులు పల్లా హృతిక్ మరియు కొండ్రు నవీన్ కుమార్ తెలంగాణ రాష్ట్ర స్థాయి విజేతలుగా నిలిచి గురువారం జరిగిన జాతీయస్థాయి ఫైనల్ క్విజ్ లో పాల్గొన్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో (4)వ స్థానంలో నిలిచారు. ఉత్తమ ప్రతిభ కనబరిచి (4) వ స్థానంలో నిలిచిన తేజ విద్యాలయ కోదాడ విద్యార్థులు 5 లక్షల (5,00,000/- ) నగదు బహుమతులను అందుకోనున్నారు.
ఫిట్ ఇండియా క్విజ్ విజేతగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసికి చెందిన Sun Beam school ప్రధమ స్థానం (25 లక్షల రూపాయలు ) , కేరళ ఎర్నాకుళం కు చెందిన Assisi Vidyaniketan ద్వితియ స్థానం (15 లక్షల రూపాయలు) , హర్యానా రాష్ట్రం గురుగ్రామ్ కు చెందిన D.A.V School తృతీయ స్థానం (10 లక్షల రూపాయలు )సాధించారు.
తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన తేజ విద్యాలయ విద్యార్థులు జాతీయ స్థాయి క్విజ్ పోటీల్లో రాణించినందుకు పాఠశాల ప్రిన్సిపాల్ ఉస్తేల రమాదేవి అభినందించారు.