Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Steve Smith : స్టీవ్‌ స్మిత్‌ సంచలన నిర్ణయం, వన్డే లకు గుడ్‌ బై

Steve Smith :ప్రజా దీవెన, హైదరాబాద్: ఆస్ట్రేలియా సీనియర్‌ బ్యాటర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డేలకు గుడ్‌? బై చెబుతున్నట్లు బుధవారం ప్రకటన చేశాడు. వన్డే క్రికెట్‌?కు రిటైర్మెంట్‌ ప్రకటించడానికి ఇదే సరైన సమయం అని స్మిత్‌ పేర్కొన్నాడు. ప్రస్తుత ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆస్ట్రేలియాకు స్మిత్‌ కెప్టెన్‌?గా వ్యవహరించాడు. ఈ టోర్నీలో జట్టును సెమీస్‌?కు చేర్చాడు. సెమీ ఫైనల్‌?లో భారత్‌??పై ఓటమి తర్వాత స్మిత్‌ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కాగా, వన్డేలకు గుడ్‌ బై చెప్పిన స్మిత్‌, టీ20, టెస్టుల్లో కొనసాగనున్నాడు. ‘జాతీయ జట్టు తరఫున ఆడటం ఎప్పుడూ గర్వకారణమే. వన్డేల్లో ప్రతి క్షణాన్ని ఆస్వాదించా. ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. రెండు వరల్డ్‌ కప్‌ల్లో సభ్యుడిగా ఉన్నా. ఇప్పుడు ఈ నిర్ణయంతో వన్డే ప్రపంచ కప్‌ 2027 కోసం జట్టును సన్నద్ధం చేసేందుకు ఆసీస్‌ మేనేజ్‌మెంట్‌కు అవకాశం వచ్చినట్లవుతుంది. ఇప్పటికీ టెస్టు క్రికెటే నాకు తొలి ప్రాధాన్యం. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరుకున్నాం. వెస్టిండీస్‌, ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లు ఉన్నాయి. టెస్టుల్లో మరికొంత కాలం ఆడగలనని భావిస్తున్నా’ అని స్మిత్‌ వెల్లడిరచాడు.కాగా, 2010లో వన్డేల్లో అరంగేట్రం చేసిన స్మిత్‌ 15ఏళ్లు ఆసీస్‌?కు ప్రాతినిధ్యం వహించాడు. అనేక విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. తన కెరీర్‌?లో 170 వన్డే మ్యాచ్‌?లు ఆడిన స్మిత్‌ 43 సగటుతో 5800 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 34 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ టాప్‌ 5లోకి విరాట్‌ ….అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌?లో టీమ్‌ ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ సత్తా చాటాడు. ప్రస్తుత ఛాంపియన్స్‌ ట్రోఫీలో అద్భుతంగా రాణిస్తున్న విరాట్‌ ఒక స్థానం మెరు గుపర్చుకొని, నాలుగో ర్యాంక్‌?కు చేరుకున్నాడు. విరాట్‌ ప్రస్తుతం 747 రేటింగ్స్‌?తో నాలుగో స్థానం లో ఉండగా, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రెండు ప్లేస్‌?లు పడిపోయి ఐదో ర్యాంక్‌?లో కొనసాగుతున్నాడు. యంగ్‌ బ్యాటర్‌ శుభ్‌?మన్‌ గిల్‌ అగ్ర స్థానం పదిలంగా ఉంచుకు న్నాడు. ఇక యంగ్‌ బ్యాటర్‌ శ్రేయ స్‌ అయ్యర్‌ ఒక స్థానం మెరుగుప ర్చుకొని ఎనిమిదో ప్లేస్‌ దక్కించు కున్నాడు. అఫ్గానిస్థాన్‌ బ్యాటర్‌ ఇబ్రహీం జర్దాన్‌ ఏకంగా 13 స్థా నాలు ఎగబాకి టాప్‌-10లోకి దూసుకొచ్చాడు. ప్రస్తుతం ఇబ్రహీం 676 రేటింగ్స్‌?తో 10వ స్థానంలో కొనసాగుతున్నాడు.

సచిన్‌ యువరాజ్‌ సరసన నిలి చిన కోహ్లీ….ఆడిన ప్రతి మ్యాచ్‌ లో ఏదో ఒక రికార్డు నెలకొలపు తున్న కింగ్‌ కోహ్లీ ఆసీస్‌ తో చాంపియన్స్‌ ట్రోఫీ సెమీఫైనల్స్‌ లో గెలుపు ద్వారా సచిన్‌ యువరాజ్‌ ల సరసన చేరాడు. ఇంతవరకు ఐసీసీ టోర్నమెంట్లలో నాకౌట్‌ గేమ్స్‌ లో ఇండియా కేవలం నాలుగు సార్లు మాత్రమే గెలిచింది. వీటిలో సచిన్‌ ఒకసారి, యువరాజ్‌ సింగ్‌ 3 సార్లు మేన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ గా నిలిచారు. ఇప్పుడీ ఐదో గెలుపుతో కోహ్లీ కూడా మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ గెలుచుకొని వారి పక్కన చేరాడు 1998లో టెస్ట్‌ మ్యాచ్‌ అన్ని జట్ల మధ్య తొలిసారి నాకౌట్‌ సిరీస్‌ జరిపింది ఐసీసీ. దానిలో భాగంగా ఆస్ట్రేలియా తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ లో ఇండియా 50 ఓవర్ల లో 307 పరుగులు చేస్తే ఆస్ట్రేలియా 263 పరుగులకే ఆల్‌ అవుట్‌ అయ్యింది. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ 141 (128 బంతుల్లో ) పరుగులు సాధించడమే కాకుండా 4 వికెట్లు తీయడం ద్వారా మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు సాధించాడు. 2000 లో జరిగిన చాంపియన్స్‌ ట్రోఫీ క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ లో ఇండియా 265 పరుగులు చేస్తే ఆస్ట్రేలియా 245 పరుగులు చేసి ఆల్‌ అవుట్‌ అయ్యింది. ఈ మ్యాచ్‌ లో 84 పరుగులు (80 బంతుల్లో ) చేసిన యువరాజ్‌ సింగ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ గా నిలిచాడు 2007 లో జరిగిన తొలి %ు%20 వరల్డ్‌ కప్‌ సెమీ ఫైనక్‌ లో ఇండియా 20 ఓవర్ల లో 188 పరుగులు చేస్తే ఆస్ట్రేలియా 173 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలయ్యింది. ఈ మ్యాచ్‌ లో 30 బంతుల్లోనే 70 పరుగులు చేసిన యువరాజ్‌ సింగ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్నాడు.సచిన్‌ టెండూల్కర్‌ వరల్డ్‌ కప్‌ కలను తీర్చిన 2001%ఔజ% ట్రోఫీ లో క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ లో ఇండియా ఆస్ట్రేలియా తలపడ్డాయి. ఆస్ట్రేలియా చేసిన 260 (50 ఓవర్ల లో ) పరుగులను ఇండియా 47.4 ఓవర్ల లోనే ఛేదించింది. ఈ మ్యాచ్‌ లో రెండు వికెట్లు తీయడం తో పాటు 57 పరుగులు చేసి నాటౌట్‌ గా నిలిచిన యువరాజ్‌ సింగ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ గా నిలిచాడు తాజా గా జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీ సెమీఫైనల్‌ లో ఆస్ట్రేలియా ఇచ్చిన 264 పరుగుల టార్గెట్‌ ను ఇండియా 48.1 ఓవర్ల లోనే ఛేదించింది. ఈ మ్యాచ్‌ లో విరాట్‌ కోహ్లీ 84 (98 బంతుల్లో ) రన్స్‌ చేసి ఇండియా విజయం లో కీలక పాత్ర పోషించాడు. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు గెలుచుకుని సచిన్‌, యువరాజ్‌ సింగ్‌ ల సరసన నిలిచాడు.


ఇండియన్‌ టాప్‌ కెప్టెన్‌ గా రో హిత్‌ రికార్డు.. …భారత వన్డే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రికార్డులకెక్కా డు. టీమిండియాను నాలుగు రకా ల ఐసీసీ టోర్నీ ఫైనల్‌ కు చేర్చిన ఏకైక కెప్టెన్‌ గా ఘనత వహించా డు. 2022 ఫిబ్రవరిలో సారథిగా పగ్గాలు చేపట్టిన రోహిత్‌.. ఈ మూడేళ్లలో అనితర సాధ్యమైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ముఖ్యంగా 2023 ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌ షిప్‌ ఫైనల్‌ కు భారత్‌ ను చేర్చి, తొలి ఐసీసీ టోర్నీ ఫైనల్‌ ఘనతను సాధించాడు. అదే ఏడాది సొంతగడ్డపై జరిగిన 2023 వన్డే ప్రపంచకప్‌ లో అజేయంగా నిలిపి, ఫైనల్‌ కు చేర్చాడు. ఇక తర్వాత ఏడాది వెస్టిండీస్‌ లో జరిగిన టీ20 ప్రపంచకప్‌ లోనూ ఫైనల్లో స్థానం సంపాదించేలా పావులు కదిపాడు. తాజాగా ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ సెమీస్‌ లో ఆస్ట్రేలియాను నాలుగు వికెట్లతో ఓడిరచి, తన కెప్టెన్సీలో నాలుగో ఐసీసీ టైటిల్‌ పోరుకు భారత్‌ అర్హత సాధించేలా చేశాడు. అయితే ఇందులో టెస్టు చాంపియన్‌ షిప్‌ ఫైనల్లో 209 పరుగులతో, వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఆరు వికెట్లతో ఆసీస్‌ చేతిలో భారత్‌ ఓడిపోయింది. అయితే టీ20 ప్రపంచప్‌ ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడిరచి 2007 తర్వాత టీమిండియా రెండోసారి టైటిల్‌ లిఫ్ట్‌ చేసేలా తన నాయకత్వ ప్రతిభ చాటాడు. గతంలో మూడు ఐసీసీ టోర్నీ ఫైనల్స్‌ కు చేర్చిన రికార్డు ఎంఎస్‌ ధోనీ పేరిట ఉండేది. 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌, 2013 ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ లలో భారత్‌ ను ఫైనల్‌ కు చేర్చాడు. అయితే అన్ని టోర్నీలలో భారత్‌ విజేతగా నిలిచింది. గతేడాదే ఈ ఫైనల్‌ చేరిక ఘనతను రోహిత్‌ సమం చేయగా, తాజాగా ఆ రికార్డును బద్దలు కొట్టి టీమిండియా తరపున మేటీ కెప్టెన్‌ గా ఎదిగాడు. ఇక ఆదివారం ఫైనల్‌ మ్యాచ్‌ ను దుబాయ్‌ వేదికగా భారత్‌ ఆడుతుంది. బుధవారం సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌ జట్ల మధ్య రెండో సెమీస్‌ లాహోర్‌ లో జరుగుతుంది. ఈ మ్యాచ్‌ లో గెలిచిన జట్టు ఫైనల్లో టీమిండియాతో తలపడుతుంది. మంగళవారం జరిగిన సెమీస్‌ మ్యాచ్‌ లో భారత్‌ కొన్ని ఘనతలు సాధించింది. తనకు కొరకరాని కొయ్యలా మారిన ఆసీస్‌ ను దాదాపు 14 ఏళ్ల తర్వాత నాకౌట్‌ లో మట్టి కరిపించింది. సొంతగడ్డపై 2011లో జరిగిన వన్డే ప్రపంచకప్‌ క్వార్టర్‌ ఫైనల్లో ఆసీస్‌ ను ఓడిరచింది. అప్పుడు 261 పరుగుల టార్గెట్‌ ను ఛేదించి, కంగారూలను ఇంటిముఖం పట్టించింది. ఆ మ్యాచ్‌ లో పూర్తి చేసిన 261 పరుగుల టార్గెటే ఆసీస్‌ పై భారత్‌ కు అత్యధిక ఛేదన కావడం విశేషం. తాజాగా దుబాయ్‌ లో జరిగిన మ్యాచ్‌ లో 265 పరగుల టార్గెట్‌ ను ఛేదించి, నాకౌట్‌ లో ఆసీస్‌ పై తన రికార్డును మెరుగు పర్చుకుంది. ఈ మ్యాచ్‌ లో టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 49.3 ఓవర్లలో 264 పరగులకు ఆలౌటవగా.. మరో 11 బంతులు మిగిలి ఉండగానే 267-6 తో భారత్‌ విజయం సాధించింది. ఛేజ్‌ మాస్టర్‌, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ (84) కీలక ఇన్నింగ్స్‌ తో ఛేజింగ్‌ లో తన ప్రతిభను మరోసారి చాటాడు.

 

ఐపీఎల్‌ 2025కు సిద్ధమవుతో న్న ఉప్పల్‌ స్టేడియం …
ఐపీఎల్‌ 2025 టోర్నమెంట్‌కు తెలుగు రాష్ట్రాల్లో అతి కీలకమైన ఉప్పల్‌ స్టేడియం సిద్ధమవుతోంది. అరకొర సౌకర్యాలు.. ప్రేక్షకులకు తగినన్ని ఏర్పాట్లలో విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఉప్పల్‌ స్టేడియాన్ని హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) ఆధునీకరిస్తోంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌లకు స్టేడియం రూపురేఖలు మారుస్తున్నారు. ఐపీఎల్‌ టోర్నీకి చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. టాటా ఐపీఎల్‌-18 వ సీజన్‌కు ఉప్పల్‌ స్టేడియంలో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌ మోహన్‌ రావు తెలిపారు. ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) యాజమాన్యంతో పాటు హెచ్‌సీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులు ఐపీఎల్‌ ఏర్పాట్లపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఐపీఎల్‌ పాలకమండలి నిబంధనల ప్రకారం అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని అధ్యక్షుడు జగన్‌ మోహన్‌ రావు ఆదేశించారు . గతేడాది కార్పొరేట్‌ బాక్సుల్లోని ఏసీలు, వాష్‌రూమ్స్‌ వల్ల కొన్ని చోట్ల తలెత్తిన సమస్యలు ఈసారి పునరావృతం కావద్దని స్పష్టం చేశారు.’ఐపీఎల్‌ మ్యాచ్‌ల టికెట్ల విక్రయం పూర్తి పారదర్శకంగా జరగాలి. స్టేడియంలో విక్రయించే ఆహార పదార్థాలు నాణ్యత బాగుండాలి. అధిక రేట్లకు విక్రయించరాదు’ అని హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌ రావు తెలిపారు. మార్చ్‌ 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్‌లో హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌పై అందరి దృష్టి పడిరది. ఈసారి ట్రోఫీ కోస ఆరెంజ్‌ ఆర్మీ పూర్తిగా కసరత్తు అయ్యింది.

అద్భుత ఫీల్డింగ్‌తో టీమిండి యా విజయం ….అన్ని విభాగా ల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించిన టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 ఫైనల్‌కు దూసుకెళ్లిం ది. వరుసగా నాలుగు మ్యాచ్‌లకు నాలుగు గెలిచి ఓటమెరుగని జట్టు గా టైటిల్‌ ఫైట్‌కు సిద్దమైంది. మంగ ళవారం దుబాయ్‌ వేదికగా జరిగిన సెమీఫైనల్లో టీమిండియా సమష్టి గా రాణించి 4 వికెట్ల తేడాతో ఆస్ట్రే లియాను ఓడిరచిన విషయం తెలి సిందే. ఈ గెలుపుతో వన్డే ప్రపం చకప్‌ 2023 ఫైనల్లో ఆసీస్‌ చేతిలో ఎదురైన పరాజయానికి టీమిండి యా ప్రతీకారం తీర్చుకుంది. మరో సారి విరాట్‌ కోహ్లీ(98 బంతుల్లో 5 ఫోర్లతో 84) అసాధారణ బ్యాటింగ్‌ తో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో అతని పై సర్వత్రా ప్రశంసల జల్లు కురు స్తోంది. అయితే విరాట్‌ కోహ్లీ కంటే.. శ్రేయస్‌ అయ్యర్‌ అసాధా రణ ఫీల్డింగ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడని నెటిజన్లు, క్రికెట్‌ విశ్లేష కులు అభిప్రాయపడుతున్నారు. ఈ విజయంలో విరాట్‌ కోహ్లీ పాత్ర ఎంత ఉందో..? అయ్యర్‌ది కూడా అంతే ఉందని కామెంట్‌ చేస్తున్నా రు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యా టింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌ టైంది. శ్రేయస్‌ అయ్యర్‌ సూపర్‌ రనౌట్‌తో ఆసీస్‌ 15-20 పరుగులు తక్కువగా చేసింది. హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకొని దూకుడుగా ఆడు తున్న అలెక్స్‌ క్యారీ(57 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 61)ని శ్రేయస్‌ అయ్యర్‌ స్టన్నింగ్‌ త్రోతో రనౌట్‌గా పెవిలియన్‌ చేర్చాడు. అతని త్రో ధాటికి బంతి నేరుగా వికెట్లను తాకింది. క్యారీ రనౌటవ్వకుండా ఉంటే.. భారీ షాట్లు ఆడేవాడు. అప్పుడు ఆసీస్‌ 280 ప్లస్‌ రన్స్‌ టార్గెట్‌ నమోదు చేసేది. ఆ లక్ష్యా న్ని చేధించడం టీమిండియాకు కష్టంగా మారేది. ఈ క్రమంలోనే బౌలర్లు అసాధారణ ప్రదర్శన కనబర్చినా.. ఛేజింగ్‌లో విరాట్‌ కోహ్లీ చెలరేగినా.. ఆఖర్లో హార్దిక్‌ పాండ్యా మెరుపులు మెరిపిం చినా.. అయ్యర్‌ రనౌట్‌ చేయకుంటే టీమిండియా గెలిచేది కాదని ఫ్యాన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. కోహ్లీతో కలిసి శ్రేయస్‌ అయ్యర్‌ కీలక భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పాడాని గుర్తు చేస్తున్నారు. అద్భుత ఫీల్డింగ్‌తో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన శ్రేయస్‌ అయ్యర్‌కే బెస్ట్‌ ఫీల్డింగ్‌ అవార్డ్‌ దక్కింది. రవి శాస్త్రి చేతుల మీదుగా అయ్యర్‌ ఈ రికార్డ్‌ను స్వీకరించాడు.

కేఎల్‌ రాహుల్‌పై అంబటి రా యుడు ప్రశంసలు …
టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌పై మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు ప్రశంసల జల్లు కురిపిం చాడు. ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగి న సెమీఫైనల్లో కేఎల్‌ రాహుల్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడని కొనియాడాడు. ఒత్తిడిని అధిగమి స్తూ అతను ఆడిన తీరు అమోఘ మని రాయుడు ప్రశంసించాడు. ఆస్ట్రేలియాతోనే జరిగిన వన్డే ప్రపంచకప్‌ 2023 ఫైనల్లో రాహుల్‌ చేసిన తప్పిదానికి తాజా ఇన్నింగ్స్‌ పరిహారమని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాతో మంగళవారం జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలుపొంది ఫైనల్‌ చేరిన విషయం తెలిసిందే.ఈ మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌(34 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. విరాట్‌ కోహ్లీతో కలిసి తీవ్ర ఒత్తిడిలో రాహుల్‌ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆఖరి వరకు క్రీజులో నిల్చొని భారీ సిక్సర్‌తో భారత విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. అయితే ఇదే ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌ 2023 ఫైనల్లో కేఎల్‌ రాహుల్‌(107 బంతుల్లో 66) జిడ్డు బ్యాటింగ్‌తో టీమిండియా ఓటమికి కారణమయ్యాడు. దాంతో అప్పట్లో అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పటికీ కేఎల్‌ రాహుల్‌ క్రీజులో ఉంటే అభిమానులు భయపడుతారు. అంతలా ఈ ఇన్నింగ్స్‌ అతని బ్యాటింగ్‌పై ప్రభావం చూపింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రాయుడు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘కేఎల్‌ రాహుల్‌ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. ఎందుకంటే నెంబర్‌ 6లో ఆడటం అతనికి అలవాటు కాదు. కానీ అపారమైన పరణితి కనబరుస్తూ ఒత్తిడిని అద్భుతంగా హ్యాండిల్‌ చేశాడు. అతను తీసుకున్న రిస్క్‌.. ఆడిన షాట్స్‌ అమోఘం. ఒత్తిడి మొత్తాన్ని అతనే భరిస్తూ.. విరాట్‌ కోహ్లీకి స్వేచ్చగా ఆడే అవకాశం కల్పించాడు. వన్డే ప్రపంచకప్‌ 2023 ఫైనల్లో రాహుల్‌ చేసిన తప్పిదానికి తాజా ఇన్నింగ్స్‌తో విముక్తి లభించిందనుకుంటున్నా. ఆ తప్పిదాన్ని అతను మనసులోనే ఉంచుకొని.. చక్కగా సరిదిద్దుకున్నాడు. ఫైనల్లోనూ అతను ఇదే తరహా ప్రదర్శన చేయాలని ఆశిస్తున్నా.జట్టులోని ప్రతీ ఒక్కరికి ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించే సామర్థ్యం ఉండటం టీమిండియా చేసుకున్న అదృష్టం. అందరూ తీవ్ర ఒత్తిడిలో అద్భుతంగా రాణిస్తూ టీమిండియాకు విజయాలు అందిస్తున్నారు. అక్షర్‌ పటేల్‌, హార్దిక్‌ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌.. విరాట్‌ కోహ్లీతో కలిసి ఈ రోజు బాధ్యత తీసుకున్నారు. ప్రతీ ప్లేయర్‌ తాము ఓ మ్యాచ్‌ విన్నర్‌ అనే విషయాన్ని రుజువు చేసుకున్నారు. ఇలాంటి ఆటగాళ్లు జట్టులో ఉండటం టీమిండియా చేసుకున్న అదృష్టం’అని అంబటి రాయుడు చెప్పుకొచ్చాడు.

చరిత్ర సృష్టించిన కేన్‌ విలియ మ్సన్‌ ….19 వేల పరుగులు పూ ర్తి చేసుకున్న కేన్‌ పలు రికా ర్డులు నమోదు ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 సెమీ ఫైనల్‌ లో దక్షిణాఫ్రికాతో జరు గుతోన్న మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ స్టార్‌ బ్యాటర్‌ కేన్‌ విలియమ్సన్‌ చరిత్ర సృష్టించాడు. ఈ పోరులో శతకం బాదడంతో పాటు న్యూజి లాండ్‌ తరఫున అత్యధిక పరుగు లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. 19 వేల పరుగులు పూర్తి చేసుకున్న న్యూజిలాండ్‌ తొలి బ్యాటర్‌ గా ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌ లో 27 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ దగ్గర ఈ ఫీట్‌ నమోదు చేశాడు. విలియమ్సన్‌ ఈ 19 వేల పరుగుల ఫీట్‌ ను అంతర్జాతీయ క్రికెట్‌ లో 440 ఇన్నింగ్స్‌ లో నమోదు చేశాడు. తక్కువ ఇన్నింగ్స్‌ లో ఈ ఫీట్‌ నమోదు చేసిన నాలుగో ఫాస్టెస్ట్‌ బ్యాటర్‌ గా నిలిచాడు. విరాట్‌ కోహ్లీ 399 ఇన్నింగ్స్‌ లో ఈ 19 వేల పరుగుల ఫీట్‌ ను నమోదు చేయగా.. సచిన్‌ తెందుల్కర్‌ (432), బ్రియాన్‌ లారా (433), జో రూట్‌ (444), రికీ పాంటింగ్‌ (444) ఇన్నింగ్స్‌ లో సాధించారు. అలానే తాజా సెంచరీతో అంతర్జాతీయ క్రికెట్‌ లో అత్యధిక శతకాలు బాదిన ఆటగాళ్ల జాబితాలోనూ స్థానం సంపాదించాడు కేన్‌ మామ. విరాట్‌ కోహ్లీ (82), జో రూట్‌ (53), రోహిత్‌ శర్మ (49), కేన్‌ విలియమ్సన్‌ (48), స్టీవ్‌ స్మిత్‌ (48) సెంచరీలు చేశారు. ఈ 19 వేల పరుగుల రికార్డ్‌ తో పాటు ఛాంపియన్స్‌ ట్రోఫీలో అత్యధిక పరుగులు (442) చేసిన న్యూజిలాండ్‌ బ్యాటర్‌ గానూ నిలిచాడు విలియమ్సన్‌. ఈ క్రమంలో స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ (441 పరుగులు) రికార్డును బ్రేక్‌ చేశాడు.