–వత్తిడిలో కూడా అద్భుతంగా రాణించావంటూ కోహ్లీకి ప్రశంస
–ఈ విజయాల వెనుక మీ కృషి ఆమోఘం అంటూ ద్రవిడ్ కు శభాష్
T20 World Cup: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: తిరుగులేని ఆటతీరుతో టీ20 వరల్డ్ కప్ (T20 World Cup)కైవసం చేసుకున్న టీమిండియాపై అభినం దనల వెల్లువ పరంపర కొనసాగు తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (pm Modi)వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid), కింగ్ కోహ్లీల(Virat Kohli)కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఈ విషయాన్ని మోదీనే స్వయంగా సోషల్ మీడియా (social media)ద్వారా పంచుకున్నారు. “ప్రియమైన రోహిత్ శర్మ అద్భుతమైన వ్యక్తి త్వం నీ సొంతం. నీ దూకుడు మనస్తత్వం, ధాటియైన బ్యాటింగ్, చురుకైన కెప్టెన్సీ భారత జట్టుకు కొత్త కోణాన్ని జోడించాయి. నీ టీ20 కెరీర్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ రోజు ఉదయం నీతో మాట్లాడి నందుకు ఎంతో ఆనందంగా ఉంది” అంటూ రోహిత్ తో ఫోన్ లో తానేం మాట్లాడారో ప్రధాని వెల్లడించారు. ఇక కింగ్ కోహ్లీని ప్రత్యేకంగా అభి నందిస్తూ, కీలక సమయంలో వత్తి డిని జయించి ఆడి పరుగుల చేసిన తీరు అద్భుతం అంటూ ప్రశంసిం చారు. ఇక రాహుల్ ద్రవిడ్ తో (Rahul Dravid)మాట్లాడుతూ మీ శిక్షణలో ప్రతిష్టా త్మకమై టి 20 వరల్డ్ కప్ సాధించ డం అభినందనీయమని అన్నారు. మీ శిక్షణలో రాటుదేలిన టీమ్ ఇండియా (team India)విజయాల వెనుక మీ కృషి మరవలేనిదని ప్రశంసలు కురిపించారు.