Team India Players: మన టీమ్ ఇండియాలో నలుగురు బలమైన ఆటగాళ్లు ఉన్నటు అందరికి తెలిసిందే. అయితే, ఈ ఆటగాళ్లంతా అంతర్జాతీయ క్రికెట్ నుంచి త్వరలో రిటైర్ ఇవ్వచ్చు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ నలుగురు ఆటగాళ్లను టీమ్ ఇండియా నుంచి బీసీసీఐ తొలగించింది. ఈ నలుగురు భారతీయ ఆటగాళ్ల (Indian players)అంతర్జాతీయ కెరీర్ దాదాపు ముగింపు పలికింది అనే చెప్పాలి. భారత జట్టు తలుపులు కూడా వీరికి క్లోజ్ చేసినట్లు సమాచారం . కానీ, వీరు ఇంకా రిటైర్మెంట్ (Retirement)మాత్రం ఇవ్వలేదు. వాళ్లు ఎవరో ఓసారి మనం తెలుసుకుందాం..
భువనేశ్వర్ కుమార్..
భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) 2012లో క్రికెట్ కెరీర్ మొదలు పెట్టారు. స్వింగ్ అతని బలం. ఇప్పటికి కూడా దానిని నమ్ముకున్నాడు. కానీ, ఇటీవల అతని ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. భువనేశ్వర్ టెస్ట్ క్రికెట్‌లో తన స్వింగ్ బౌలింగ్‌ను కూడా నిరూపించుకున్నాడు. అయితే, దురదృష్టవశాత్తు భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) గాయాల కారణంగా చాలా సార్లు జట్టులోకి, వెలుపల వస్తూ వెల్ళడం జరిగింది. 2018లో గాయం కారణంగా, భువీ టెస్ట్ క్రికెట్ వంటి సుదీర్ఘ ఫార్మాట్‌లకు దూరం కావడం ప్రారంభించాడు. అప్పటి నుంచి అతనికి ఒక్క టెస్టులో కూడా ఆడే అవకాశం రాలేదు. ఇప్పుడు భువీకి టెస్టు క్రికెట్ ముగిసినట్టేనని అర్థం అవుతుంది.
వృద్ధిమాన్ సాహా..
ఈ లిస్ట్ లో మరొకరు వృద్ధిమాన్ సాహా .. ఇతను కూడా చాలా మంచి వికెట్ కీపర్. అయితే, అతనికి టెస్టు క్రికెట్‌లో ఆడే అవకాశం మాత్రం కనపడలేడు. వృద్ధిమాన్ ( Wriddhiman)సాహా 2010లో దక్షిణాఫ్రికాపై టెస్టుల్లో ఎంట్రీ చేసాడు. అప్పటి నుంచి సాహా కేవలం 40 టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 2022లో శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో మొండిచేయి చూపించారు. ఇప్పుడు మళ్లీ టెస్టు జట్టులోకి పునరాగమనం చేయగలడన్న ఈ ఆటగాడి ఆశలు కూడా దాదాపుగా ముగిశాయి.
కరుణ్ నాయర్..
కరుణ్ నాయర్ (Karun Nair)చెన్నైలో ఇంగ్లండ్‌పై ట్రిపుల్ సెంచరీ చేసినపుడు కరుణ్ నాయర్ లాంగ్ హార్స్ అని అనిపించినా, ఆ తర్వాత పరిస్థితులు అంత చేంజ్ అయ్యాయి. ట్రిపుల్ సెంచరీ చేసిన తర్వాత, అతను కూడా పెద్దగా రాణించలేకపోయాడు. అందుకే అతను జట్టు నుంచి బయటకు పంపారు. కరుణ్ నాయర్ నవంబర్ 2016లో ఇంగ్లండ్‌పై తన అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత అతను చివరిసారిగా మార్చి 2017లో ఆస్ట్రేలియాటీంతో ఆడాడు.
ఇషాంత్ శర్మ..
మన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ (Ishant Sharma) అంతర్జాతీయ కెరీర్ దాదాపుగా ముగిసినాట్టే అర్థం అవుతుంది. ఇషాంత్ శర్మ చివరిసారిగా నవంబర్ 2021లో న్యూజిలాండ్ టీంతో జరిగిన కాన్పూర్ టెస్టులో ఆడాడు. ఇషాంత్ శర్మ (Ishant Sharma) 100కి పైగా టెస్టులు ఆడాడు. కానీ అతను తన పేరిట 311 వికెట్లు తీసాడు. ఇప్పుడు ఇషాంత్ శర్మ ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. దీంతో ఇప్పుడు ఈ ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ఇవ్వబోతున్నట్టు సమాచారం