The strength of our players in the Asian Games: ఆసియా క్రీడల్లో అంతకంతకూ జోరు
-- సత్తా చాటుతున్న భారత ఆటగాళ్ళు -- తాజా మెడల్ తో మొత్తం 16 గోల్డ్ మెడల్స్
ఆసియా క్రీడల్లో మన ఆటగాళ్ళ జోరు
— సత్తా చాటుతున్న భారత ఆటగాళ్ళు
— తాజా మెడల్ తో మొత్తం 16 గోల్డ్ మెడల్స్
ప్రజా దీవెన /హంగ్జూ: ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు రోజు రోజు కు తమ జోరు పెంచుతున్నారు. హాంగ్జూలో జరుగుతున్న గేమ్స్‌లో ఇప్పటి వరకు ఇండియా 71 పతకాలను కైవసం చేసుకొని సత్తా (India managed to win 71 medals) చాటుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు జరిగిన ఆసియా క్రీడల్లో ఇండియాకు అత్యధిక సంఖ్యలో పతకాలు రావడం మొట్ట మొదటిసారి. ఇవాళ ఆర్చరీ మిక్స్‌డ్ ఈవెంట్‌లో ఇండియా తన ఖాతాలో ఓ గోల్డ్ మెడల్ వేసుకున్న సందర్భంలో ఇండియా మెడల్ జాబితా పెరిగిపోయింది.
గతంలో భారత్ ఆసియా క్రీడల్లో అత్యధికంగా 70 పతకాలను గెలుచుకోగా ఆ రికార్డును అథ్లెట్ల బృందం బ్రేక్ చేసింది. జకర్తాలో 2018లో జరిగిన ఆసియా క్రీడల్లో ఇండియా 70 మెడల్స్ గెలుచుకోగా ఆ ఏడాది 16 స్వర్ణాలు, 23 సిల్వర్, 31 కాంస్య పతకాలను ఆ బృందం తన ఖాతాలో వేసుకున్నది.
ఈసారి ఇప్పటికే 16 గోల్డ్, 26 సిల్వర్, 29 కాంస్య పతకాలను ఇండియా గెలుచుకున్న విషయం (India won 16 gold, 26 silver and 29 bronze medals) తెలిసిందే. ఇవాళ ఉదయం 35 కిలోమీటర్ల మిక్స్‌డ్ రేస్ వాక్ ఈవెంట్‌లో భారత్‌కు కాంస్య పతకం వచ్చింది. మంజూ రాణి, రామ్ బాబూ ఆ మెడల్‌ను గెలుచుకున్నారు.