Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Vinesh Phogat: ఒలంపిక్స్ లో ఓడి..ఎన్నికల్లో గెలిచిన వినేష్ ఫోగట్

Vinesh Phogat: ప్రజా దీవెన, హరియాణా: ఒలిం పిక్స్‌లో పతకం చేజారినా ఎమ్మె ల్యేగా గెలిచిన వినేష్ ఫోగట్. జులా నా నుంచి జయకేతనం కేవలం 10 0 గ్రాముల అధిక బరువు కారణం గా పారిస్ ఒలిం పిక్స్‌ ఫైనల్‌కు అర్హ త సాధించ లేకపోయి. చివరి మెట్టు పై బోల్తా పడిన వినేశ్ ఫోగట్ (Vinesh Phogat)హరి యాణా అసెంబ్లీ ఎన్నికల్లో గెలు పొంది ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంగ ళవారం వెలువడిన హరియా ణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రె స్ పార్టీ తరఫున జులానా నియోజ కవర్గం నుంచి విజయం సాధించా రు. బీజేపీ తరఫున బరిలోకి దిగిన యోగేష్ కుమార్‌పై 6వేలకు పైగా ఓట్ల తేడాతో గెలు పొందారు. ఇక ఈ జులానా నియో జకవర్గంలో గత 19 ఏళ్లుగా కాంగ్రె స్ పార్టీకి రాని విజయాన్ని తొలి సారి ఎన్నిక ల్లో పోటీ చేసిన వినేష్ ఫోగట్ (Vinesh Phogat) అందించారు.కొన్ని రోజుల క్రితం పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ (Wrestling in the Olympics) విభాగంలో ఫైనల్‌ కు చేరిన వినేష్ ఫోగట్ (Vinesh Phogat).. ఫైనల్‌కు ముందు 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉన్న కారణంగా.. పోటీ నుంచి అనర్హతకు గురయ్యారు. ఆ సమయంలో దేశం మొత్తం ఆమెకు మద్దతుగా నిలిచారు.

ఇక ఆ పారి స్ ఒలింపిక్స్ తర్వాత.. రెజ్లింగ్‌కు గుడ్‌బై చెప్పిన వినేశ్ ఫోగట్.. రాజ కీయాల్లోకి అడుగు పెట్టారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 5వ తేదీన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పు కున్నారు.అనంతరం హస్తం పార్టీ.. వినేష్ ఫోగట్‌కు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జులానా టికెట్ కేటా యించింది. ఇక గతేడాది రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ (Former Chief of Wrestling Federation of India), బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ తమను లైంగిక వేధిం పులకు గురి చేశారంటూ రెజ్లర్లు దేశవ్యాప్తంగా ఆందోళన చేయగా వినేశ్ ఫోగట్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది.ఇక అందరి అం చనాలు, ఎగ్జిట్ పోల్స్ అంచనా లను కూడా తలకిందులు చేస్తూ.. హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ (bjp) మెజార్టీ స్థానా లకు మించి సీట్లలో ఆధిక్యం, విజ యాన్ని సొంతం చేసుకుంది.

ఇక ఇప్పటికే 2014, 2019లో గెలిచి అధికారం దక్కించుకున్న కమలం పార్టీ తాజాగా మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టి హరియాణా రాజకీ యాల్లో ఒక కొత్త రికార్డును సృష్టిం చేందుకు సిద్ధంగా ఉంది. ఒలిం పిక్స్‌లో అనూహ్య రీతిలో పతకం చేజార్చుకున్న వినేష్ ఫోగట్‌పై యావత్ దేశం సానుభూతి వ్యక్తం చేసింది. బీజేపీ (bjp) మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకం గా జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న సమయంలోనే వినేష్ ఫోగట్ దేశం దృష్టిని ఆకర్షించారు. లైంగిక వేధిం పులపై గొంతెత్తిన వినేష్ ఫోగట్ ఒలింపిక్స్‌లో ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి, ఎమ్మెల్యేగా (mla) పోటీ చేశారు. దీంతో జులానా నియోజకవర్గం వార్తల్లో నిలిచింది. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన వినేష్ ఫోగట్ గెలిచారా? లేదా? అని ఎక్కువ మంది సెర్చ్ చేశారు. దీంతో వినేష్ ఫోగట్ (Vinesh Phogat) గూగుల్ ట్రెండ్స్‌లో నిలిచారు. రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో (Rajasthan, Haryana, Delhi, Himachal Pradesh, Uttarakhand) వినేష్ ఫోగట్ (Vinesh Phogat) గురించి ఎక్కువ మంది సెర్చ్ చేశారు.