Virat Kohli: ప్రజాదీవెన, బెంగళూరు: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) పోలీసు కేసు (police case) నమోదైంది. బెంగళూరులోని విరాట్ కోహ్లీకి చెందిన వన్ 8 కమ్యూన్ పబ్‌లో (8 Commune Pub) నిబంధనలను ఉల్లంఘించిన సమయం మించిపోయినా నడిపించారని అందుకే కేసు నమోదు (case filed) చేశామని పోలీసులు (police)తెలిపారు.
గత రాత్రి 1:30 వరకు పబ్‌ను నడిపారని.. వన్8 కమ్యూన్‌తో పాటు మరో నాలుగు పబ్‌లపైనా (Four pubs) కేసులు నమోదు చేశామని బెంగళూరు పోలీసులు (Bangalore Police) తెలిపారు. పబ్‌ల రాత్రి ఒంటి గంట వరకు తెరిచేందుకే అనుమతి ఉందని కానీ… ఈపబ్‌లు నిబంధనలు ఉల్లంఘించాయని తెలిపారు. విరాట్ పబ్‌లో (Virat Pub) మ్యూజిక్‌ను కూడా భారీ సౌండ్‌తో ప్లే చేస్తున్నారని కూడా తమకు ఫిర్యాదులు అందాయని బెంగళూరు పోలీసులు (Bangalore Police) తెలిపారు.