Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Women’s Premier League: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌కు కడప విద్యార్థిని..తల్లిదండ్రుల హర్షాతి రేకాలు

ప్రజా దీవెన, కడప: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాకు చెందిన ఓ గ్రామీణ విద్యార్థిని స్టార్ క్రికెటర్ల తో కలిసి ఆడే అవకాశం వచ్చింది. తాజాగా జరిగిన ఉమెన్స్ ప్రీమియ ర్ లీగ్ 2025 టోర్నమెంట్ వేలంలో ఈ విద్యార్థిని అమ్ముడుపోయింది. రూ. 55 లక్షల పారితోషకంతో ఢిల్లీ క్యాపిటల్స్ శ్రీ చరణి అనే విద్యార్ధిని సొంతం చేసుకుంది. శ్రీ చరణి ఆం ధ్రప్రదేశ్‌కు చెందిన అమ్మాయి. కడ ప జిల్లా వీరపనేని మండలం ఎర్ర మల్లె గ్రామానికి చెందిన విద్యార్థిని. ఓ సాధారణ కుటుంబానికి చెందిన శ్రీ చరణి.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025లో ఆడబోతుంది. శ్రీ చరణి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో చిరు ఉ ద్యోగిగా పనిచేస్తున్నాడు.

కాగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌కు తమ కుమార్తె సెలెక్ట్ కావడంపై తల్లి దండ్రులు, బంధువులు, గ్రామాస్తు లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 20 25లో జరిగే మూడో సీజన్ కోసం బెంగుళూరులో మెగా వేలం నిర్వ హించారు. ఈ మెగా వేలంలో మొ త్తం 120 మంది ఆటగాళ్లు పాల్గొ న్నారు. అందులో 91 మంది భార తీయులు ఉండగా 29 మంది విదే శీయులు ఉన్నారు. మొత్తం ప్లేయ ర్లలో ముగ్గురు అసోసియేట్ నేషన్స్‌ కు చెందినవారు ఉన్నారు. భారత ఆటగాళ్ల విషయానికి వస్తే, 82 మంది అన్‌క్యాప్‌, 9 మంది క్యా ప్‌లో ఉన్నారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్‌లో ముంబై ఇం డియన్స్ టైటిల్ గెలుచుకుంది. రెం డో సీజన్ టైటిల్‌ను రాయల్ ఛాలెం జర్స్ బెంగళూరు (RCB) సొంతం చేసుకుంది. కాగా ఈ రెండు సీజ న్లలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో స్థానం లో నిలిచింది.