Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

World Cup India Team Announcement: ప్రపంచకప్ భారత జట్టు ప్రకటన

-- 15మందితో నిర్దిష్ట సమయంలోనే వెల్లడి

ప్రపంచకప్ భారత జట్టు ప్రకటన

— 15మందితో నిర్దిష్ట సమయంలోనే వెల్లడి

ప్రజా దీవెన/ న్యూఢిల్లీ: ప్రపంచకప్ కోసం ప్రాథమికంగా జట్లను ప్రకటించేందుకు ఆఖరి తేది సెప్టెంబర్ 5 కాగా సరిగ్గా సెప్టెంబర్ 5వ తేదీనే బీసీసీఐ సెలెక్షన్ కమిటీ భారత ప్రపంచకప్ జట్టును ప్రకటించడం విశేషం.

వన్డే ప్రపంచకప్ 2023 (ODI World Cup 2023) కోసం టీమిండియా  జట్టును ప్రకటించింది బిసిసిఐ. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో జట్టును ప్రకటించగా అందరూ ఊహించినట్లుగానే ఆసియా కప్ కోసం ప్రకటించిన జట్టు నుంచే ఆటగాళ్లను ఎంపిక చేసింది.

ఇదిలా ఉండగా 15 మందిని మాత్రమే ప్రకటించాల్సి ఉండగా ఆసియా కప్ జట్టులో చోటు దక్కించుకున్న తిలక్ వర్మ, ప్రసిధ్ కృష్ణలను పక్కన పెట్టగా బ్యాకప్ గా ఉన్న సంజూ సామ్సన్ కు మరోసారి నిరాశ ఎదురైంది. యుజువేంద్ర చహల్ ను అసలు పట్టించుకోలేదు.

రోహిత్ శర్మ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా ఉండనుoడగా గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్ ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇషాన్ కిషన్ మరో వికెట్ కీపర్ గా వ్యవహరించనుండగా వన్డే ఫార్మాట్ లో పెద్దగా రాణించని సూర్యకుమార్ యాదవ్ పై బీసీసీఐ సెలెక్టర్లు నమ్మకం పెట్టారు.

శ్రేయాస్ అయ్యర్ కూడా తన స్థానాన్ని నిలుపుకోగా ఆసియా కప్ లో చోటు దక్కించుకున్న తిలక్ వర్మ, ప్రసిధ్ కృష్ణలతో పాటు బ్యాకప్ గా ఉన్న సంజూ సామ్సన్ లను బీసీసీఐ  పూర్తిగా పక్కన పెట్టింది. ప్రపంచకప్ జట్టులో మార్పులు చేసుకునేందుకు ఐసీసీ అవకాశం ఇవ్వగా సెప్టెంబర్ 28 వరకు మార్పులు చేసుకోవచ్చు.

*టీమిండియా ప్రపంచకప్ జట్టు :* రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ, శుబ్ మన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దుల్ ఠాకూర్, జస్ ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్.