Praja Deveena
Newspaper Banner
Date of Publish : 07 April 2026, 2:43 pm Posted by : praja deveena

Youngest Chess World Records : బిగ బ్రేకింగ్, చెస్‌లో అరుదైన ఘ నత, 2ఏళ్ల 11 నెలల బాలుడు నె లకొల్పిన రెండు ప్రపంచ రికార్డులు 

Youngest Chess World Records : ప్రజా దీవెన, హైద రాబాద్: చెస్ ప్ర పంచంలో అద్భుత ప్రతిభతో ఒక చిన్నారి సంచలనం సృష్టించాడు. కేవలం 2 సంవత్సరాలు 11 నెలల వయస్సులోనే కొండా శ్రేయాన్ష్ ము రళీకృష్ణ పటేల్ రెండు ప్ర పంచ రి కార్డులను సాధించి చరిత్ర సృష్టిం చాడు. రాయ్ చె స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో శ్రే యాన్ష్ తన అసాధారణ మే ధస్సును ప్రదర్శించాడు.

కొండా శ్రేయాన్ష్ మురళీకృష్ణ పటేల్ కేవలం 15 నిమిషాల 52 సెకం డ్ల లో 93 బ్యాక్ ర్యాంక్ చెక్‌మేట్స్ ప రిష్కరించగా,1 గంట 9నిమిషాల 9 సెకండ్లలో 21 చెస్ బోర్డులను అ మర్చా డు. ఈ ప్రదర్శనతో World Book of Records London లో రెండు ప్రపంచ రికార్డులు నమోదు అయ్యాయి.

ఈ కార్యక్రమం జూబ్లీహిల్స్‌లోని ఎ మ్మెల్యేస్ & ఎంపీస్ కాల నీ కల్చ ర ల్ సెంటర్‌లో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ( batti vikramarka), మంత్రులు కొండాసురేఖ (Konda Surekha) వాకిటి శ్రీహరి (VakkitiSrihari) హాజరయ్యారు.

ఈ సందర్భంగా క్రీడాశాఖ మంత్రి శ్రీహరి మాట్లాడుతూ, “చి న్న వయ స్సులోనే ప్రపంచ రికార్డు సాధించడం గొప్ప విష యం. శ్రేయాన్ష్ భవి ష్యత్తులో దేశానికి గర్వకారణంగా నిలు స్తాడు” అని అన్నారు.మంత్రి సురేఖ తన మనవడి ప్రతిభ ను చూసి భావోద్వేగానికి గురై ఆనంద భాష్పాలు రాల్చారు. తల్లి కొండా సుస్మితా పటేల్ (Konda Susm ita Patel) మాట్లాడుతూతన కుమారుడి అభిరుచులకు అనుగు ణం గా పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.

రాయ్ చెస్ అకాడమీ వ్యవస్థాపకు డు రాజశేఖర్ రెడ్డి (Ra jashekar Reddy) మాట్లాడుతూ శ్రేయాన్ష్ ప్రతిభ ఇతర చి న్నారులకు ప్రేరణగా నిలుస్తుందని చెప్పారు.ఈ కార్యక్రమం లో శ్రేయాన్ష్‌కు ట్రోఫీలు, సర్టి ఫికెట్లు ప్రదానం చేశారు. త్వర లో అతను బ్రిటిష్ పార్లమెంట్‌లో Wo rld Book of Recor ds Lon do n తరఫున సత్కారం పొందనున్నట్లు నిర్వాహ కులు తెలిపారు.