దిగ్విజయంగా సాగుతోన్న ఆదిత్య-ఎల్1
ప్రజా దీవెన/ఇస్రో: సూర్యుడి అధ్యయనం కోసం చేపట్టిన ఆదిత్య-ఎల్1 మిషన్ దిగ్విజయవంతంగా( Aditya-L1 mission successful) ముందుకు సాగుతోంది. ఉపగ్రహం ఎల్1 పాయింట్ వైపు వెళ్తుండగా ఈ రోజు తెల్లవారుజామున ఆదిత్య ఎల్1 మరో కక్ష్యలోకి ప్రవేశించింది.
నాలుగో సారి కక్ష్య పెంపు సజావుగా సాగినట్లు( As the fourth time orbit raising went smoothly) ఇస్రో తన ఎక్స్ అకౌంట్లో పేర్కొన్నది. ఈ ఆపరేషన్ చేపట్టిన సమయంలో మారిషస్, బెంగుళూరు, షార్, పోర్టు బ్లెయిర్‌లో ఉన్న ఇస్రో స్టేషన్లు ఆ శాటిలైట్ ట్రాక్ చేసినట్లు వెల్లడించాయి.
ఫిజి దీవుల నుంచి ఆదిత్య ఎల్1కు చెందిన పోస్టు బర్న్ ఆపరేషన్స్( Post burn operations of Aditya L1) పర్యవేక్షిస్తున్నారు. కొత్త కక్ష్య 256 కి.మీ x 121973 కి.మీ దూరంలో ఉన్నట్లు ఇస్రో పేర్కొన్నది.