Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Boeing helicopters are manufactured here బోయింగ్‌ హెలికాప్టర్ల తయారీ ఇక ఇక్కడే

బోయింగ్‌ హెలికాప్టర్ల తయారీ ఇక ఇక్కడే

— హైదరాబాద్ లోనేప్లాంట్ సంసిద్ధం

ప్రజా దీవెన /హైదరాబాద్‌: భారత సైన్యం కోసం అపాచీ హెలికాప్టర్ల(Apache helicopters)తయారీని బోయింగ్‌ ప్రారంభించింది. అమెరికాలోని అరిజోనాలో బోయింగ్‌కు చెందిన మెసా ఉత్పాదక కేంద్రం (Mesa is a manufacturing center) లో ఏహెచ్‌64 అపాచీ ఈ-మాడల్‌ హెలికాప్టర్లు సిద్ధమవుతున్నాయి.

మొత్తం 6 హెలికాప్టర్లు ఇండియన్‌ ఆర్మీకి డెలివరీ కానున్నాయి. ఇదిలా వుండగా ఈ హెలికాప్టర్ల బాడీ ఫ్యూజ్‌లేజ్‌ (Body fuselage of helicopters) లు హైదరాబాద్‌లోని టాటా బోయింగ్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్‌,టీబీఏఎల్‌, ప్లాంట్‌లోనే సిద్ధమవుతున్నాయి. ఈ సంవత్సరం ఆరంభంలోనే తొలి ఏహెచ్‌64 అపాచీ ఈ-మోడల్‌ హెలిక్యాప్టర్‌ ఫ్యూజ్‌లేజ్‌ ఇక్కడి నుంచి అమెరికాకు చేరింది.

ఈ క్రమంలోనే అక్కడి ప్లాంట్‌లో హెలికాప్టర్ల తయారీని మొదలుపెట్టినట్టు బోయింగ్‌ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు బోయింగ్‌ ఇండియా అధ్యక్షుడు సలీల్‌ గుప్టే తెలియజేశారు. 2020లో బోయింగ్‌.. 22 ఈ-మోడల్‌ అపాచీ హెలిక్యాప్టర్లను ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు అందజేసింది.

దీంతో ఇండియన్‌ ఆర్మీ కోసం (For Indian Army)  6 ఏహెచ్‌64 అపాచీ ఈ-మోడల్‌ హెలిక్యాప్టర్ల కాంట్రాక్టును దక్కించుకున్నది.వచ్చే ఏడాదిలోగా వీటిని అంచాలన్నది డీల్‌. ఏహెచ్‌64 ఈప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన దాడుల హెలిక్యాప్టర్‌గా పేరొందినట్టు ఈ సందర్భంగా బోయింగ్‌ మెసా ప్లాంట్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌, అటాక్‌ హెలిక్యాప్టర్‌ ప్రోగ్రామ్స్‌ విభాగం ఉపాధ్యక్షుడు క్రిస్టినా ఉఫా తెలిపారు.

ఏహెచ్‌64 అపాచీ ఈ-మాడల్‌ ట్విన్‌-టర్బోషాఫ్ట్‌ అటాక్‌ హెలికాప్టర్‌ ఇందులో అత్యాధునిక రాడార్‌ వ్యవస్థ( State-of-the-art radar system) ఉంటుంది. తక్కువ ఎత్తులోనూ సమర్థంగా పనిచేయగలదు. 280kmph గరిష్ఠ ఎత్తులోప్రయాణించే వేగం అందుబాటులో 16 యాంటి-ట్యాంక్‌ ఏజీఎం-114 హెల్‌ఫైర్‌, స్ట్రింగర్‌ మిస్సైల్స్‌, హైడ్రా-70 అన్‌గైడెడ్‌ మిస్సైల్స్‌ శత్రువులపై బుల్లెట్ల దాడి కోసం 1,200 రౌండ్ల సామర్థ్యంతో 30-ఎంఎం చైన్‌ గన్‌. నిమిషానికి 600-650 రౌండ్లు ఫైర్‌ చేయవచ్చని అధికారులు వెల్లడిస్తున్నారు.