చంద్రయాన్-3 మిషన్‌కు కౌంట్ డౌన్
— ఈ నెల 27న ముహూర్తం ఖరారు
ప్రజా దీవెన/ ఇస్రో: చంద్రయాన్-3 మిషన్‌ను చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ చేయడానికి కౌంట్ డౌన్ షురూ అయింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రయాన్-3 మిషన్‌ను చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ చేయడానికి ప్రయత్ననాలు కొనసాగిస్తుంది.
వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 23వ తేదీ ల్యాండ్ చేయడానికి ముహూర్తం ఖరారు చేసినా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో మరో ముహూర్తం ఖరారు చేయడానికి అనివార్యమైంది. కాగా అప్పటికప్పుడు పరిస్థితుల ప్రభావం తో పరిస్థితులు అనుకూలంగా ఉంటే విజయవంతం అవుతుందని ఏజెన్సీ ఉన్నత అధికారి ఒకరు వెల్లడించారు.
ఆగస్టు 23న చంద్రయాన్-3 చంద్రుడిపై ల్యాండ్ కావడానికి రెండు గంటల ముందు, ల్యాండర్ మాడ్యూల్ ఆరోగ్యంతో పాటు చంద్రునిపై పరిస్థితుల ఆధారంగా ఆ సమయంలో దానిని ల్యాండింగ్ చేయడం సరైనదేనా అనే దానిపై మేము నిర్ణయం తీసుకుంటామని నీలేష్ చెప్పారు.ఏదైనా అంశం ప్రతికూలంగా ఉంటే మేము ఆగస్టు 27న చంద్రునిపై మాడ్యూల్‌ను ల్యాండ్ చేస్తామని దేశాయ్ స్పష్టం చేశారు.