Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Easily the longest space flight: సుగమంగా సుదీర్ఘ అంతరిక్ష యాత్ర

-- క్షేమంగా భూమికి తిరిగొచ్చిన వ్యోమగాములు -- అంతరిక్షంలో 371 రోజులు గడపి కజక్‌స్థాన్‌లో ల్యాండ్

సుగమంగా సుదీర్ఘ అంతరిక్ష యాత్ర

— క్షేమంగా భూమికి తిరిగొచ్చిన వ్యోమగాములు
— అంతరిక్షంలో 371 రోజులు గడపి కజక్‌స్థాన్‌లో ల్యాండ్

ప్రజా దీవెన /కజక్‌స్థాన్‌: నాసా వ్యోమగామి ఫ్రాంక్‌ రూబియో, రష్యా వ్యోమగాములు సెర్గే ప్రొకోపీవ్‌, దిమిత్రి పెటెలిన్‌లు తమ అంతరిక్ష యాత్రనుbవిజయవంతంగా (A successful space mission) ముగించుకొని భూమిని చేరారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి సోయుజ్‌ ఎంఎస్‌-23 (Soyuz MS-23) స్పేస్‌ క్రాఫ్ట్‌లో బయలుదేరిన వీరు కజక్‌స్థాన్‌లో సురక్షితంగా ల్యాండ్‌ (Landed safely in Kazakhstan) అయ్యారని నాసా ప్రకటించింది.

ఈ ప్రయాణం 157.4 మిలియన్‌ మైళ్లు కాగా వాస్తవానికి ఈ మిషన్‌ ఆరు నెలల్లోనే పూర్తి కావాల్సి ఉన్నా 2022 డిసెంబరులో రష్యన్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌లో ఊహించని లీక్‌ చోటు చేసుకోవడంతో గడువు పొడిగించారు. దాంతో వ్యోమగాములు అంతరిక్షంలో 371 రోజులు (Astronauts spent 371 days in space) గడపాల్సి వచ్చిందని, అంతకముందు నాసా వ్యోమగామి మార్క్ వాన్ డే హే 355 రోజులు గడిపి రికార్డు సృష్టించారని పేర్కొంది.

రూబియో సెప్టెంబరు 2022 సెప్టెంబరు 21న అంతరిక్షంలోకి వెళ్లారు. 2023 సెప్టెంబరు 11న ఆయన మార్క్‌ అంతరిక్షయాన రికార్డును బద్ధలుగొట్టారు. ఇక అంతరిక్ష కేంద్రంలో గడిపిన సమయంలో రూబియో అనేక శాస్త్రీయ పరిశోధనలకు సహకరించారు.

భవిష్యత్తులో అనేక మిషన్లను చేపట్టడానికి నాసా సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆయన పరిశోధనల సమాచారం ఎంతో విలువైనదిగా మారింది. నిర్దేశించిన సమయం కన్నా ఎక్కువ రోజులు అంతరిక్షంలో గడపాలనే విషయం తెలిసినా రూబియో, ప్రొకోపీవ్‌, దిమిత్రిలు వెనక్కి తగ్గలేదు.

సవాళ్లను ఎదుర్కొంటూనే తమ విధులు నిర్వహించారు. వారి అంకితభావం అంతరిక్షంలో మానవ జీవితంపై (Dedicated to human life in space) అవగాహనను మెరుగుపరచడమే కాకుండా భవిష్యత్‌ వ్యోమగాములకు ఓ మార్గదర్శకంగా నిలిచిందని ఖగోళ శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.