దరఖాస్తులకు ‘ కాళోజీ ‘ ఆహ్వానం
ప్రజా దీవెన/ హైదరాబాద్: పోస్టు గ్రాడ్యుయేషన్ దరఖస్తుల కోసం కాళోజీ వర్సిటీ ఆహ్వానం పలికింది.
రాష్ట్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైనందున సోమవారం నుంచి కాళోజీ వర్సిటీ పోస్టు గ్రాడ్యుయేషన్ (PG) వైద్య సీట్ల భర్తీ చేసేందుకు కార్యాచరణ ప్రారంభించింది. పీజీ వైద్య సీట్ల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆదివారం రోజున నోటిఫికేషన్ విడుదల చేసింది.
విశ్వవిద్యాలయ పరిధిలోని కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుoడగా జాతీయ స్థాయి అర్హత పరీక్షా నీట్ 2023లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.ఇవాళ ఉదయం 10 గంటల నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కాళోజీ వర్సిటీ సూచించింది. నిర్దేశిత దరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించింది.
ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తులు, సర్టిఫికెట్లను యూనివర్సిటీ పరిశీలించిన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. ప్రవేశాలకు సంబంధించి అర్హత, ఇతర సమాచారానికి అధికారిక వెబ్‌సైట్ www.knruhs.telangana.gov.in ను సంప్రదించవచ్చు.