Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mahatma Gandhi University : మహాత్మా గాంధీ యూనివర్సిటీ సై న్స్ కళాశాల ఆధ్వర్యంలో వైద్య శిబిరం

Mahatma Gandhi University : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల, యశోద హాస్పిటల్ మలక్ పేట సౌజన్య సహకారంతో వైద్య శిబిరాన్ని బుధవారం సైన్స్ క ళాశాలలో నిర్వహించారు. ఈ కా ర్యక్రమాన్ని విశ్వవిద్యాలయ ఉపకు లపతి ఆచార్య ఖాజాఆల్తాఫ్ హు స్సేన్ తో పాటు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వాలరవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎం జె యు ఉపకుల పతి అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడు తూ స్వీయ క్రమశిక్షణ ఆరోగ్య సం రక్షణ దేశ సేవలో భాగమే అన్నారు. ఆరోగ్యంగా ఉండడమే మీ యొక్క కుటుంబానికి మరియు దేశానికి అ తి పెద్ద బహుమతి అని పేర్కొన్నా రు.

ఈ ఉచిత శిబిరంలో జనరల్ ఫిజీషి యన్, ఆర్థోపెడిక్, గైనకాలజీ మరి యు కార్డియాలజీ సంబంధించిన స ర్వీసులు అందుబాటులో ఉన్నా యని అదేవిధంగా రక్త పరీక్ష, షుగర్ పరీక్ష, ఈసీజీ, మరియు 2D-ఇకో లాంటి టెస్టులను నిర్వహించారు. ఈ సందర్భంగా ఇలాంటి సదవకా శాన్ని విశ్వవిద్యాలయ సిబ్బంది మరియు విద్యార్థి విద్యార్థినులు సద్వినియోగపరుచుకోవాలని ఆ రోగ్య జీవన ప్రమాణాలు సన్న గిల్లు తున్న తరుణంలో ఇలాంటి ఉచిత శిబిరాలు ఏర్పాటు చేయడం పట్ల సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే ప్రేమ్ సాగర్ ని మరియు హాస్పటల్ సిబ్బందిని అభినందించారు.

కళాశాల ప్రిన్సిపల్ డా ప్రేంసాగర్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమా లు నిర్వహించడానికి అవకాశం ఇ చ్చిన విశ్వవిద్యాలయ అధికారుల కు మరియు సహకరించిన యశోద హాస్పిటల్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య అలువాలా రవి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మ ద్దిలేటి పసుపుల, ఆర్ట్స్ కళాశాల ప్రి న్సిపల్ డాక్టర్ అరుణప్రియ మరి యు వివిధ విభాగాల అధిపతులు డాక్టర్ తిరుమల, డాక్టర్ జ్యోతి, డా క్టర్ మాధురి, డాక్టర్ శాంతకుమా రి,డాక్టర్ ఉపేందర్ రెడ్డి, డాక్టర్ క ళ్యాణి, డాక్టర్ సుధాకర్ అధ్యాపకు లు, విద్యార్థి విద్యార్థినులు పాల్గొ న్నారు.

 

*బతుకమ్మ సంబరాలలో ఎంజి యు ఉపకులపతి…* ఎంజియూ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో బతుక మ్మ సంబరాలను ఘనంగా నిర్వ హించారు. వివిధ కళాశాలలు, పరీ క్షల నియంత్రణ శాఖ, అడ్మిన్, మ రియు హాస్టల్స్ డైరెక్టర్ కార్యాల యాల సిబ్బంది ప్రత్యేకంగా పూల తో బతుకమ్మలను అలంకరించి ఆ ర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఆటపా టలతో బతుకమ్మను జరుపుకున్నా రు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స తీ సమేతంగా విచ్చేసిన ఉపకులప తి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృ తిక చిహ్నం బతుకమ్మ అని కొని యాడారు. భిన్నత్వంలో ఏకత్వాని కి పూలు ప్రతిరూపాలుగా భారత దే శం సకల ప్రజలు ఐక్యత అనురా గాలతో ముందుకు సాగాలని పిలు పునిచ్చారు. అనంతరం భక్తి శ్రద్ధల తో బతుకమ్మలను తయారుబతుక మ్మలను తయారు చేసిన శాఖ అ ధ్యాపకులకు సిబ్బందికి అధికారు లకు మెమెంటోలు బహుకరించారు.

ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆ ర్డినేటర్ మద్దిలేటి, కళాశాలల ప్రిన్సి పాల్ డా శ్రీదేవి, డా అరుణప్రియ డా ప్రేమ్సాగర్, డీన్ ఆచార్య కె అం జిరెడ్డి, ఆడిట్ సెల్ డైరెక్టర్ డా వై ప్ర శాంతి, తదితర అధ్యాపకులు అధి కారులు, బోధనేతర సిబ్బంది సు నీత, నీలిమ,ఉమా తదితరులు పాల్గొన్నారు.