Netflix: ఈ రోజుల్లో చాలామంది ఓటీటీలకు (ott)అలవాటు పడ్డారు. ఓటీటీ కింగ్ నెట్‌ఫ్లిక్స్‌లో లెక్కలేనన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, టీవీ షోస్, డాక్యుమెంటరీలు అందుబాటులో ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్ (Netflix) సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే చాలా కాలక్షేపం అవుతుంది. అలాగే ఎన్నో కొత్త విషయాలను తెలుసుకోవచ్చు. కానీ రెగ్యులర్ ఇంటర్నెట్ డేటా ప్యాక్‌తో పాటు దీని మంత్లీ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడం అధిక భారంగా అనిపిస్తుంది. అలాగని డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని రీఛార్జ్ ప్లాన్ల ద్వారా ఎక్స్‌ట్రా డబ్బులు చెల్లించకుండానే నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు. మరి ఆ రీఛార్జ్ (recharge)ప్లాన్‌లేవో తెలుసుకుందాం.
* జియో రూ.1299 రీఛార్జ్ ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. దీంతో అన్‌లిమిటెడ్ కాల్స్, డైలీ 100 ఎస్‌ఎంఎస్‌లు, డైలీ 2 జీబీ డేటా అందుకోవచ్చు.
* జియో రూ.1,799 రీఛార్జ్ ప్లాన్ 84 రోజులు వ్యాలిడిటీ, డైలీ 3 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, డైలీ 100 ఎస్‌ఎంఎస్‌లు చేస్తుంది. అలాగే కంటెంట్ ఫ్రీగా చూసుకోవచ్చు.
* వొడాఫోన్ ఐడియా రూ.1198 రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ 70 రోజులు. 70 రోజులపాటు నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ ఫ్రీగా చూడవచ్చు. 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ అదనం.
* వొడాఫోన్ ఐడియా రూ.1599 ప్లాన్ కింద 84 రోజులపాటు వ్యాలిడిటీ, 2.5 జీబీ డైలీ డేటా పొందొచ్చు. బేసిక్ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా లభిస్తుంది.
* ఎయిర్‌టెల్ రూ.1,798 రీఛార్జ్ ప్లాన్‌తో 84 రోజుల వ్యాలిడిటీ, డైలీ 3 బీబీ డేటా పొందొచ్చు. 84 రోజులపాటు ఫ్రీగా బేసిక్ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ కూడా అందుకోవచ్చు. అన్‌లిమిటెడ్ 5జీ డేటా సైతం లభిస్తుంది.