Nursery : ప్రజా దీవెన శాలిగౌరారం : వేసవిలో నర్సరీలను నీరు పోసి కాపాడాలని శాలిగౌరారం ఎంపీడీఓ గార్లపాటి జ్యోతి లక్ష్మి అన్నారు. మంగళవారం వల్లాల గ్రామంలోని నర్సరీని ఎంపీడీఓ జ్యోతి లక్ష్మి ఆకస్మిక తనిఖీ చేశారు . ఆమె నర్సరీ లోని జర్మినేషన్ రిజిస్టర్, నీరు పొసే విధానాన్ని పరిశీంచారు.మొలకెత్తిన మొక్కల ను కాపాడడానికి షెడ్ నెట్ వేయాలని సూచించారు.
మొలకలు రాని బ్యాగుల్లో నూతన విత్తనాలను నాటాలని,ప్రైమే బెడ్స్ లో విత్తనాలు చల్లాలని ఉపాధి హామీ సిబ్బంది కి సూచించారు.ఆమె వెంట ఏపిఓ జంగమ్మ,టెక్నీకల్ అసిస్టెంట్ నరేష్, పంచాయితీ కార్యదర్శి కృష్ణ, ఫీల్డ్ అసిస్టెంట్ యానాల లింగమ్మ తదితరులు పాల్గొన్నారు