Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

They both fell asleep: ఆ ఇద్దరూ నిద్రలోకి జారుకున్నారు…

-- వారిని లేపడానికి ప్రయత్నిస్తున్నాo

ఆ ఇద్దరూ నిద్రలోకి జారుకున్నారు…

— వారిని లేపడానికి ప్రయత్నిస్తున్నాo

ప్రజా దీవెన/ ఇస్రో: ఆ ఇద్దరూ నిద్రలోకి జారుకున్నారు… వారిని లేపడానికి ప్రయత్నిస్తున్నాము… అయితే వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదoటున్నారు… ఇంతకీ వారెవరో తెలుసా… వారేనoడి మన ల్యాండర్ మరియు రోవర్ లు..చంద్రయాన్-3 విజయవంతమైన ల్యాండింగ్ తర్వాత అందరి దృష్టి విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌పై ఉందనేది సుస్పష్టం.

ఆయితే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చీఫ్ ఎస్ సోమనాథ్ ఓ ప్రకటన ( Indian Space Research Organization (ISRO) chief S Somnath made a statement) జారీ చేశారు. ప్రజ్ఞాన్ రోవర్ అనుకున్నది చేసిందని, ప్రస్తుతం నిద్ర నుంచి మేల్కొనకున్నా ఎలాంటి సమస్య లేదని స్పష్టం చేశారు. గిర్ సోమనాథ్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ సోమనాథ్ ఆలయాన్ని సందర్శించిన అనంతరం ఇస్రో చీఫ్ మీడియా తో మాట్లాడారు.

నవంబర్ లేదంటే డిసెంబర్‌లో జరిగే ఎక్స్‌రే పొలారిమీటర్ శాటిలైట్ ప్రయోగానికి నేషనల్ స్పేస్ ఏజెన్సీ ఇప్పుడు సన్నాహాలు ( The National Space Agency is now gearing up to launch an X-ray polarimeter satellite ) చేస్తోందని చెప్పారు. కాగా చంద్రుడిపై నిద్రిస్తున్న ప్రజ్ఞాన్ పరిస్థితి గురించి ఇస్రో చీఫ్ వివరించారు. చంద్రుడిపై ఉష్ణోగ్రత దాదాపు మైనస్ 200 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయిందని ( The temperature on the moon has dropped to almost minus 200 degrees Celsius) , దాని ఎలక్ట్రానిక్ సర్క్యూట్‌లు దెబ్బతినకుండా ఉంటే నిద్ర నుండి మేల్కొంటుందని ఆయన తెలిపారు.

చంద్రునిపై తెల్లవారుజాము ప్రారంభమైనందున, చంద్రయాన్-3 యొక్క ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్‌తో ఈ నెల ప్రారంభంలో వారి స్థానాన్ని నిర్ధారించడానికి కమ్యూనికేషన్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నించామని వెల్లడించారు. తమ వంతు ప్రయత్నమైతే చేసాము కాని ఎటువంటి సిగ్నల్ అందలేదని (They tried their best but no signal was received) చెప్పారు.

చంద్రునిపై రాత్రి పడిందని, సెప్టెంబర్ మొదటివారంలో ల్యాండర్, రోవర్ రెండింటినీ స్లీప్ మోడ్‌లో ఉంచామని ( Both the lander and the rover have been placed in sleep mode) వెల్లడించారు. ఆయితే సరళమైన భాషలో వివరిస్తే ఆ ఇద్దరూ నిద్రలోకి జారుకున్నారని, వారిని లేపడానికి ప్రయత్నిస్తున్నామని విస్పష్టంగా చెప్పారు.