Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

UPI: యూపీఐ మరింత విస్తృతం..!

–ఆన్ లైన్ చెల్లింపులు రూ.5 లక్షలకు పెంపు అంగీకారం
–ఇతరుల ఖాతా నుంచి కూడా చెల్లించే అవకాశం
–అతి త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్బీఐ నిర్ణయం
–భవిష్యత్ లో గంటల వ్యవధిలోనే చెక్కుల క్లియరెన్స్‌ కు ఆదేశం
–కొనసాగుతోన్న 9వసారీ రెపో రేటు సైతం యథాతథం

UPI:ప్రజా దీవెన, ముంబై: ఆన్ లైన్ డిజి టల్ (Online digital) నగదు నిర్వహణ మరింతగా విస్తృతం కానుంది. మారుతున్న కాలానుగుణంగా ఆన్ లైన్ చెల్లిం పులు సరళీకృతo చేయడంతో పాటు గరిష్ట పరిమితి పెంపు ప్రతి పాదనలను సిద్ధం చేసింది రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా యాజమా న్యం. గూగుల్‌పే, ఫోన్‌పేలాంటి యూపీఐ యాప్‌ల ద్వారా చెల్లిం పులు ప్రస్తుతమున్న రూ. లక్ష పరి మితిని రూ. 5 లక్షలకు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఇదే సందర్భంలో యూపిఐ చెల్లింపుల జరపాలంటే వాటిని మన బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయాల్సిం దే అయితే ఒకరు వేరొకరి ఖాతా నుంచి చెల్లింపులు జరిపే వీలు క ల్పించేలా డెలిగేటెడ్‌ పేమెంట్స్‌ వి ధానాన్ని త్వరలో అందుబాటు లోకి తీసుకురానున్నట్లు భారతీయ రిజ ర్వ్‌ బ్యాంకు (ఆర్బీఐ) ప్రకటించింది. డిజిటల్‌ చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు, యూపీఐ వినియోగాన్ని మరింతగా పెంచేం దుకు ద్వైమాసిక ద్రవ్యపరపతి వి ధాన సమీక్షలో ఆర్బీఐ (RBI) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ప్రధానమైనది ఈ ప్రాతినిధ్య చెల్లిం పుల విధానం ప్రధానమైంది.

ఈ విధానంలో ఒక యూపీఐ (UPI) వినియో గదారు తన బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి నిర్దేశిత పరిమితి వరకూ యూపీఐ చెల్లింపులు జరిపేందుకు మరో వ్యక్తికి అధికారమిచ్చే వీలుంటుంది. బ్యాంక్‌ ఖాతా లేని వ్యక్తులు, మైన ర్లు తమ తల్లిదండ్రులు లేదా సంబం ధిత వ్యక్తుల బ్యాంక్‌ ఖాతాల ద్వా రా యూపీఐ చెల్లింపులు జరిపేందు కు ఈ కొత్త విధానం ఉపయోగప డనుందని థర్డ్‌పార్టీ పేమెంట్‌ అప్లికే షన్‌ కివీ సహ వ్యవస్థాపకులు మోహిత బేడీ అన్నారు. అయితే, ఈ వెసులుబాటుకు సంబంధించిన పూర్తి విధివిధానాలను ఇంకా ప్రక టించాల్సి ఉంది.
ఇక పై యూపీఐ పరిమితి రూ.5 లక్షలకు.. యూపీఐ ద్వారా పన్ను చెల్లింపుల పరిమితి ప్రస్తుతం రూ.లక్షగా ఉండగా దాన్ని ఏకంగా రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్‌ బీఐ ప్రకటించింది. తద్వారా పన్ను చెల్లింపుదారులు అధిక మొత్తంలో పన్నును సైతం యూపీఐ ద్వారా సులువుగా, వేగంగా చెల్లించేందుకు వీలవుతుందని పేర్కొంది. అలాగే చెక్కుల ద్వారా చెల్లింపులను మరిం త వేగవంతం చేయనున్నట్లు ఆర్‌బీ ఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ తెలి పారు. ప్రస్తుతం చెక్‌ ట్రంకేషన్‌ సిస్ట మ్‌ (సీటీఎస్‌) బ్యాచ్‌ ప్రాసెసింగ్‌ విధానంలో పనిచేస్తుంది.

అంటే, నిర్దిష్ట సమయం వరకు వచ్చిన చెక్కులన్నింటినీ ఒక బ్యాచ్‌గా ప్రాసెస్‌ చేసి, క్లియర్‌ చేస్తారు. ఈ విధానంలో చెక్కు క్లియరెన్స్‌కు రెం డు రోజుల దాకా సమయం పడు తుంది. ఇకపై బ్యాచ్‌ ప్రాసెసింగ్‌కు (Batch processing) బదులు ఆన్‌ రియలైజేషన్‌ సెటిల్‌ మెంట్‌ విధానంలో చెక్కులను క్లియ ర్‌ చేయనున్నారు. అంటే చెక్కు వచ్చిన తక్ష ణమే క్లియరెన్స్‌కు వెళు తుంది. తద్వారా కొన్ని గంటల స మయంలోనే అది క్లియర్‌ అవు తుంది. ఈ విధానం వల్ల చెక్కు ద్వారా చెల్లింపులు జరిపే వారికి, సొమ్ము అందుకునేవారికీ ఉప యోగం.అనధికారిక రుణయాప్‌ల కు చెక్‌ పెట్టేందుకు తమ నియంత్ర ణ లోని సంస్థలు నిర్వహిస్తున్న డిజి టల్‌ రుణ యాప్‌లతో ఒక రిపా జిటరీని ఏర్పాటు చేయాలని ఆర్బీ ఐ ప్రతిపాదన చేసింది. అనధికారిక యాప్‌లను గుర్తించడంతో పాటు కస్టమర్లు వాటి వలలో పడకుండా ఉండేందుకు ఇది దోహదపడు తుందని పేర్కొంది.