Whatsapp: ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో మెటా దూసుకొని పోతున్న సంగతి అందరికి తెలిసిందే. ఇప్పటికే తమ అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో మెటా ఏఐ (ai) పేరుతో సేవలను అందిస్తోన్న సంగతి విషయం తెలిసిందే. అలాగే రోజురోజుకీ కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ యూజర్లను ఆకట్టుకునే ప్రయత్ననాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా మెటా ఏఐ (ai) మూడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకోని రాబోతున్నట్లు సమాచారం. ఇంతకీ మెటా ప్రవేశ పెట్టిన ఆ మూడు కొత్త ఫీచర్లు ఏంటి ఆ ప్రయోజనాలు ఏమిటో చూద్దాం రండి..
మనలో చాల మంది ఏదైనా సందేహం ఉంటే మెటా ఏఐ చాట్‌ను (ai chat) ఓపెన్ చేసి టెక్ట్స్ టైప్ చేయాల్సి వస్తుంది. అందుకోసం తాజాగా తీసుకొచ్చిన కొత్త ఫీచర్ సహాయంతో ఫొటోతో కూడా సమాధానం మనం పొందొచ్చు. అలాగే ఫొటోలను ఎడిట్ చేసుకునే సదుపాయాన్ని కూడా ప్రవేశపెట్టింది మెటా. ఈ కొత్త ఫీచర్ (new features) సహాయంతో ఫొటోలను మీకు నచ్చిన విధంగా ఎడిట్ సులువుగా చేస్తాను. మీరు ఏదైన ఫొటో పంపి అందులోని రంగులను మార్చాలని కమాండ్ ఇస్తే చాలు వెంటనే ఆ ఫోటోను
మార్చేస్తుంది. వాస్తవినికి ఈ ఫీచర్ టెస్టింగ్‌లో ఉండగా త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ఫీచర్‌తో ఇకపై ఫొటో ఎడిటింగ్ కోసం ఇతర ప్లాట్ ఫామ్స్‌ను ఉపయోగించాల్సి అవసరం అసలు ఉండదు.
ఈ క్రమంలో మెటాతో (meta) రియల్ టైమ్‌లో సంభాషణలు జరిగేలా కొత్త ఫీచర్‌ను ప్రవేశ పెట్టబోతోంది. అలాగే ఏవైనా ప్రశ్నలు అడగ్గాన్నే సంబంధిత విషయం గురించి స్పష్టంగా వివరంగా తెలుపుతుంది. దీంతో మనం నేరుగా ప్రశ్నలు అడగొచ్చు. అంతేకాదు ఏఐ మనతో జోకులను కూడా తెలుపుతుంది. అలాగే అత్యంత వేగంగా సమాధానాలు (answers)కూడా ఇస్తుంది. అలాగే మెటా ఏఐ వాయిస్‌ని కూడా మార్చుకునే అవకాశం కూడా కల్పించారు. కొందరు ప్రముఖుల వాయిస్‌ను కూడా మనం సెట్ చేసుకునే అవకాశం కూడా ఉంది.