Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

YouTube Music: యూట్యూబ్ మ్యూజిక్‌లో ఈ కొత్త ఫీచర్ గురించి మీకు తెలుసా..

YouTube Music: సాధారణంగా చాలా మంది మనలో పాటలు (songs) వినడానికి ఎంతోగానో ఇష్టపడుతుంటారు. పండుగలు, శుభకార్యాలు, ఇతర ఫంక్షన్లలో కూడా పాటలకు (songs) ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రస్తుత రోజులలో ప్రతి ఒక్కరూ కూడా యూట్యూబ్‌లో పాటలు, వీడియాలను చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఈ తరుణంలోనే యూట్యూబ్ తన కస్టమర్ల కోసం సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేయబోతుంది. ఈ సరికొత్త ఫ్యూచర్ ఏమిటంటే “ఏఐ పవర్డ్ ఆస్క్ ఫర్ మ్యూజిక్”(AI Powered Ask for Music). దీనిని యూట్యూబ్ ప్రవేశ పెట్టింది.

ఈ ఫీచర్ ఉపయోగించి చాలా ఈజీగా పాటలను వినవచ్చు. దీనితో వాయిస్ కమాండ్‌ (command) ద్వారా మనకు నచ్చిన పాటలను సులువుగా వినేందుకు ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి పరిమిత సంఖ్యలో మాత్రమే ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. మోడర్న్ ఆడియో విగ్రేషన్ టెక్నాలజీని (Modern audio vibration technology) ఉపయోగించి యూజర్స్ హమ్మింగ్ చేయడం, పాట పాడడం లేదా ఈలా వేయడం ద్వారా ఈజీగా నచ్చిన పాటను వినవచ్చు.

ఇప్పటివరకు యూట్యూబ్‌లో (youtube) మనకు నచ్చిన పాటలను వినాలి అంటే ఆ పాట పేరు, సినిమా పేరు, గాయకుడు పేరును ఎంటర్ చేయాల్సి వచ్చేది. అనంతరం ఆ సినిమాలోని పాటలన్నీ చూపించేవి. కానీ ఈ కొత్త ఫీచర్ (new feature)ద్వారా వచ్చిన పాటలు వినడం చాలా ఈజీ. కేవలం మనకు నచ్చిన పాట పేరును మైక్‌ సహాయంతో చెబితే చాలు వెంటనే ఆ పాట మనకు ప్లే అవుతుంది. ఈ టూల్ ప్రస్తుతం యూట్యూబ్ ప్రయోగ దశలోనే ఉంది. గూగుల్ దీనిని అతి త్వరలోనే తీసుకు వచ్చే అవకాశం ఉంది. ఇటీవల యూట్యూబ్ హమ్ చేసే సామర్థ్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చింది. ఇందు కొరకు అధునాతన ఆడియో రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు తెలుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ఫ్యూచర్ ను ఉపయోగించి మీకు నచ్చిన పాటలు వింటూ ఎంజాయ్ చేయండి.