Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Earthlings in Nepal: నేపాల్ లో నేలపాలైన బతుకులు

--భారత్ పక్క దేశoలో భారీ భూకంపం -- నూటా ఇరవై మంది పైగానే దుర్మరణo --గాయాలపాలైన వందలాది మంది -- సమీప భారత్ రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు

నేపాల్ లో నేలపాలైన బతుకులు

–భారత్ పక్క దేశoలో భారీ భూకంపం
— నూటా ఇరవై మంది పైగానే దుర్మరణo
–గాయాలపాలైన వందలాది మంది
— సమీప భారత్ రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు

ప్రజా దీవెన/ నేపాల్: భారతదేశం పొరుగు దేశం నేపాల్ లో మానవ బతుకులు నేలపాలయ్యాయి. నేపాల్ దేశంలో శుక్రవారం రాత్రి 11 గంటలు దాటాక రిక్టర్‌ స్కేల్‌పై 6.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు ( An earthquake measuring 6.4 on the Richter scale occurred in Nepal after 11 o’clock on Friday night) యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది.

భూకంప కేంద్రం 11 మైళ్ల లోతులో ఉన్నట్లు కూడా గుర్తించింది. హిమాలయన్‌ దేశం నేపాల్‌లో సంభవించిన భూకంపం కారణంగా సుమారు 120 మంది పైగా దుర్మరణం చెందగా వందలాది సంఖ్యలో (At least 120 people have died and hundreds have been injured in the Nepal earthquake) గాయపడ్డారు .

దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడి ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. నేపాల్‌ లోని వాయువ్య జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభ వించినట్లు పేర్కొన్నారు. అర్ధరాత్రి కావడం వల్ల పలు ప్రాంతా లతో కమ్యూనికేషన్‌ తెగిపోయినట్లు చెప్పారు.

దీంతో తొలుత ప్రమాద తీవ్రత తెలియలేదని ప్రజలంతా నిద్రలో ఉన్న సమ యంలో భూకంపం సంభవించినట్లు ( Like an earthquake when people are sleeping) అధికారులు తెలిపారు. ఈ భూకంప తీవ్రతకు భారత్‌లోని పలు ప్రాంతాలు కూడా కంపించాయి.

దేశ రాజధాని దిల్లీ, యూపీ, బిహార్‌లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయని స్ధానిక ప్రజలు, ప్రభుత్వాలు వెల్లడించాయి.