earthquake in Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ లో ఘోర భూకంపం
-- 200 మంది చనిపోయినట్లు అధికారిక ప్రకటన -- అంతకు రెట్టింపు స్థాయిలో ఉంటుందని అనధికార లెక్క -- మూడొంతుల మంది గాయపడ్డారని వార్తా సంస్థల వెల్లడి
ఆఫ్ఘనిస్తాన్ లో ఘోర భూకంపం
— 200 మంది చనిపోయినట్లు అధికారిక ప్రకటన
— అంతకు రెట్టింపు స్థాయిలో ఉంటుందని అనధికార లెక్క
— మూడొంతుల మంది గాయపడ్డారని వార్తా సంస్థల వెల్లడి
ప్రజా దీవెన/ ఆఫ్ఘనిస్తాన్: ఆఫ్ఘనిస్తాన్ ఆపత్కాలంలో చిక్కుకుంది పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లో 6.3 తీవ్రతతో సంభవించిన రెండు భూకంపాలు దాదాపు 200 మంది మృతి చెంది ఉంటారని అధికారిక ప్రకటన వెలువడగా అంతకు రెట్టింపు స్థాయిలో మృత్యువాత పడి ఉంటారని అనధికార లెక్కలు చెబుతున్నాయి. అదే సమయంలో అధికారిక లెక్కల ప్రకారం మరణించిన వారి సంఖ్యకు మూడు, నాలుగొంతుక దాదాపు 600 మంది పై చిలుకు గాయపడ్డారని అక్కడి వార్తా సంస్థలు వెల్లడిస్తున్నాయి.
శోధన సహాయక చర్యలు కొనసాగుతున్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇంకా అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నారని సమాచారం. తొలుత 320 మంది మరణించినట్లు ఐక్యరాజ్యసమితి ప్రకటించిన తర్వాత ఈ సంఖ్య ఇంకా పరిశీలలోనే ఉందని వివరించింది.
క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించేందుకు 12 అంబులెన్సులను పంపినట్లు అఫ్గాన్‌లోని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు వెల్లడించారు. మరోవైపు క్షతగాత్రులను వీలైనంత త్వరగా ఆస్పత్రులకు తరలించాలని స్థానిక సంస్థలకు ఆదేశించారు తాలిబన్లు. నిర్వాసితులకు ఆహారం, పునరావాసం కల్పించాలని చెప్పారు.
బాధితులకు అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు. పశ్చిమ అఫ్గానిస్థాన్‌లో శనివారం ఉదయం తీవ్ర భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై తీవ్రత 6.3గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. శనివారం మధ్యాహ్నం సమయంలో భూకంపం వచ్చినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు.
కనీసం ఐదు శక్తిమంతమైన భూకంపాలు సంభవించినట్లు వెల్లడించారు. హెరాత్‌కు వాయువ్యంగా 40 కిలోమీటర్ల భూకంప కేంద్రం ఉందని జియోలాజికల్ సర్వే వెల్లడించింది. మేమంతా కార్యాలయంలో పనిలో నిమగ్నమయ్యాం. హఠాత్తుగా భవనమంతా కంపించింది. గోడలు బీటలు పారడం వల్ల భయంతో పరుగుతీశామని తెలిపారు.