Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Genocide in Syria: సిరియాలో మారణహోమo

-- ఉగ్ర దాడి లో 100 మందికి పైగా దుర్మరణం -- సిరియన్ మిలిటరీ అకాడమీపై డ్రోన్ దాడి

సిరియాలో మారణహోమo

— ఉగ్ర దాడి లో 100 మందికి పైగా దుర్మరణం
— సిరియన్ మిలిటరీ అకాడమీపై డ్రోన్ దాడి

ప్రజా దీవెన/సిరియా : సిరియాలో మరోసారి ఉగ్రవాదులు మారణ హోమం సృష్టించారు. సిరియన్ మిలిటరీ అకాడమీపై జరిగిన డ్రోన్ దాడిలో 100 మందికి పైగా మృతి (More than 100 people were killed in a drone attack on a Syrian military academy) చెందారని అక్కడి వార్తా సంస్థలు వెల్లడించాయి. ఈ దాడుల్లో 100కు పైగా దుర్మరణం పాలు కాగా 125 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రభుత్వ ఆధీనంలో ఉన్న హోంస్‌లో డ్రోన్ దాడులకు ఉగ్రవాద సంస్థలు కారణమని సమాచారం. మృత్యువాత పడ్డ వారిలో సగానికి సగం మంది సైనిక గ్రాడ్యుయేట్లు (Half of the dead were military graduates) అని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ తెలిపింది.

పేలుడు పదార్థాలతో నిండిన డ్రోన్లతో ఈ దాడులకు పాల్పడ్డారని తెలియజేసింది. వీరి మృతికి సంతాప సూచకంగా సిరియా ప్రభుత్వం శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు సంతాప దినాలను (The Syrian government has declared three days of mourning from Friday to mark the death) ప్రకటించింది.