Indian Students : ప్రజా దీవెన, అమెరికా: అమెరికా లో అణువణువునా అమలవుతో న్న చర్యలు అనేక రకాలుగా ఆందో ళనలకు గురి చేస్తున్నాయనే వాద నకు బలం చేకూరుతోంది. అమెరి కా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి విప్లవాత్మక మైన మార్పులు, చేర్పులు అనేక రంగాలను కుదేలు చేస్తోన్న విష యం తెలిసిందే. అందులో భాగం గానే తాజాగా అమలులోకి వచ్చిన మరో కొత్త బిల్లు గుబులు రేకెత్తిస్తోం ది. ఈ క్రమంలో భారతీయ విద్యా ర్ధులను మానసిక ఒత్తిడికి గురి చే స్తోంది.
అమెరికాలో ఉన్న భారతీయ వి ద్యార్ధులను మరో కొత్త టెన్షన్ వెం టాడుతోంది. నిన్నమొన్నటి వరకు అక్రమవలసదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన అమెరికా అధ్యక్షు డు డోనల్డ్ ట్రంప్ ఇప్పుడు సక్రమ పద్ధతిలో అమెరికా వెళ్లిన వారికి కూడా ప్రశాంతత లేకుండా చేస్తు న్నారు.
అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చదువు పూర్తి చేసుకున్న వారికి ఇచ్చే ఓపి టి ఆథరైజేషన్ (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) విధానానికి ఫుల్‌స్టాప్ పె ట్టేందుకు ట్రంప్ సర్కార్ ప్లాన్ చే స్తోంది. అందులో భాగంగానే అమె రికా పార్లమెంట్‌లో ఒక కొత్త బిల్లు కూడా ప్రవేశపెట్టారు. ఆ కొత్త బిల్లు అమలులోకి వస్తే అమెరికాలో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) సబ్జెక్టుల్లో ఉన్నత చదువులు పూర్తి చేసుకు న్న విదేశీ విద్యార్థులు చదువు పూ ర్తికాగానే దేశం విడిచి వెళ్లాల్సి ఉం టుంది.
అమెరికా ప్రభుత్వం తీసు కుంటు న్న ఈ నిర్ణయం F1, M1 స్టూడెంట్ వీసా హోల్డర్స్‌పై ప్రభావం చూపి స్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం సుమారు 3 లక్షల మంది భారతీయ విద్యా ర్థుల మెడపై ఈ బిల్లు కత్తిలా వేళ్లా డుతోంది. ఈ కొత్త బిల్లు అమలు లోకి వస్తే చదువు పూర్తయిన తక్ష ణమే వారు అమెరికా విడిచి రావా ల్సి ఉంటుంది. అంటే వారికివారే సెల్ఫ్ డిపొర్ట్ అవ్వాలన్నమాట. లేదంటే వీసా గడువు ముగిసినప్ప టికీ ఇంకా అమెరికాలో ఉంటున్నా రనే నేరం కింద వారిని అక్రమ వల సదారులుగా గుర్తిస్తూ ప్రభుత్వమే వారిని డిపొర్టేషన్ చేస్తుంది.
ఇప్పటికే చదువులు పూర్తి చేసు కుని, ఓపిటి ఆథరైజేషన్ తీసుకుని H1B వీసా కోసం ప్రయత్నాలు చే స్తున్న వారిపై కూడా ఈ కొత్త బిల్లు ప్రభావం చూపనుంది. అందుకే వా రంతా తమ పరిస్థితి ఏంటా అని బి క్కుబిక్కుమంటున్నారు.
ఓపిటితో లాభనష్టకేమిటి…
అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసుకున్న వారికి అక్కడే ఉద్యోగం సంపాదించుకునేందుకు ఈ ఆప్షన ల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఆథరైజేషన్ అ వసరం ఉంటుంది. విదేశీ విద్యార్థు లలో ఓపిటి ఉన్న వారికి మాత్రమే వారు చదువుకున్న డిగ్రీ ఆధారంగా అమెరికాలో ఉద్యోగం చేసుకునేం దుకు అనుమతి ఉంటుంది. ఈ ఓపిటి ఉన్న వారికి కనీసం మూ డేళ్లపాటు అమెరికాలో ఉండేందు కు అనుమతి ఉంటుంది. ఆ సమ యంలోనే వారు ఒకవైపు తాత్కా లిక అవసరాల కోసం ఏదో ఒక ఉ ద్యోగం చేస్తూనే H-1B వీసా పొం దేందుకు ప్రయత్నిస్తుంటారు.
అయితే, ఓపిటి విధానం రద్దు చేయడం వల్ల ఉన్నత చదువులు పూర్తి చేసుకున్న వారికి ఆ తరు వాత H-1B వీసా లేకుండా అమెరి కాలో ఉండేందుకు అవకాశం ఉండదు. డోనల్డ్ ట్రంప్ మొదటిసా రి అధికారంలోకి వచ్చినప్పుడే ఓపి టి విధానాన్ని (OPT authorizati on) రద్దు చేసేందుకు ప్రయత్నం జరిగినప్పటికీ అప్పట్లో అది విఫ లమైంది. కానీ రెండోసారి అధికా రంలోకి వచ్చిన తరువాత ట్రంప్ చాలా దూకుడుగా వ్యవహరిస్తు న్నారు.
ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి నట్లుగానే అమెరికా చరిత్రలో ఇంత కు ముందెప్పుడూ లేనివిధంగా మా స్ డిపొర్టేషన్‌కు తెరతీసిన విష యం తెలిసిందే. దీంతో ఈ బిల్లు విషయంలో కూడా ట్రంప్ వైఖరి అలానే ఉంటుందనే వార్తలొస్తు న్నాయి.