Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Iran president Raisi: ఇరాన్ అద్యక్షుడు రైసీ గల్లంతు

ఇరాన్‌ అధ్య క్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ గల్లంతైంది.

తూర్పు అజర్‌బైజాన్‌లో కూలిన చాపర్‌
ఆనకట్ట ప్రారంభానికి వెళ్లివస్తుం డగా సoఘటన
జోల్ఫా అడవుల్లో హెలికాప్టర్‌ మిస్సింగ్‌
భారీ వర్షాలు, పొగమంచుతో
సహాయక చర్యలకు తీవ్ర ఆటం కాలు

ప్రజా దీవెన, ఇరాన్: ఇరాన్‌ అధ్య క్షుడు ఇబ్రహీం రైసీ(Iran president Raisi) ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌( helicopter) గల్లంతైంది. పొరుగు దేశం అజర్‌బైజాన్‌, ఇరాన్‌లోని తూర్పు అజర్‌బైజాన్‌ ప్రావిన్స్‌ సరిహద్దుల్లో ఓ డ్యామ్‌ ప్రారంభోత్స వానికి ఆయన ఇరాన్‌ విదేశాంగ మంత్రి హుస్సేన్‌ ఆమిర్‌ అబ్దులాహి యన్‌, అధికారులు, అంగరక్షకుల తో కలిసి హెలికాప్టర్‌లో బయలుదే రారు. కార్యక్రమం అనంతరం తిరు గు ప్రయాణమయ్యారు. మరో రెం డు హెలికాప్టర్లు( helicopter) కూడా ఆయన చాపర్‌ వెంట ఉన్నాయి. మధ్యాహ్నా నికి తూర్పు అజర్‌బైజాన్‌ ప్రావిన్స్‌ లోని పర్వతప్రాంతాలు, డిజ్మార్‌ అటవీ ప్రాంతాన్ని దాటే క్రమంలో జోల్ఫా గ్రామం సమీపంలో రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు రాడా ర్‌తో సంబంధాలు తెగిపోయాయి.

ఆ సమయంలో జోల్ఫాతో పాటు ఉజి, అర్దేషిరి, బారాజిన్‌ గ్రామాల తోపాటు డిజ్మార్‌ అటవీ ప్రాంతాల్లో భీకర వర్షం కురుస్తోంది. ఈదురు గాలులు, దట్టమైన పొగమంచుతో వాతావరణం ప్రతికూలంగా మారిం ది. మరో 2 హెలికాప్టర్లు గమ్యస్థా నానికి చేరుకున్నా రైసీ ప్రయాణి స్తున్న హెలికాప్టర్‌ జాడ లేకపో వడంతో ఆదివారం సాయంత్రం నుంచి ఇరాన్‌(Iran) వ్యాప్తంగా టెన్షన్‌ నెలకొంది. కాసేపటికి తూర్పు అజర్‌ బైజాన్‌ గవర్నర్‌ మాలిక్‌ రహ్మతి అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కూలిపోయింది’’ అని ప్రకటించారు. అయితే ఇరాన్‌ అధి కారిక మీడియా, అధికారులు మాత్రం రైసీ ప్రయాణిస్తున్న హెలి కాప్టర్‌ జోల్ఫా ప్రాంతంలో హార్డ్‌ ల్యాండింగ్‌ అయ్యిందని తెలిపారు. అధ్యక్షుడు ప్రయాణిస్తున్న హెలికా ప్టర్‌లో విదేశాంగ మంత్రి, పైలట్‌, కోపైలట్‌, అధ్యక్షుడి భద్రతా బృందం అధిపతి, అంగరక్షకులు, అధికారులు ఉన్నట్లు వివరించారు.

Iran President Raisi missing with helicoptier