Shocking News : ప్రజా దీవెన, వాషింగ్టంన్ : అమెరి కాలో ట్రంప్ యుగo పునః ప్రారం భమైన తర్వాత సంచలన నిర్ణయా లకు తెరలేసింది. క్రమం తప్పకుం డా నిర్ణయాలు తీసుకుంటూ ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ ప్రపంచo దృష్టిని ఆకర్శిస్తున్నాడు. ఈ క్రమం లో దేశాలపై సుంకాలతో ట్రేడ్ వార్ కు తెరతీసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. అ యన నెక్స్ట్ స్టెప్ విదేశీ పర్యాటకు ల రాకపై వేయనున్నారు. అమెరి కాకు రాకుండా మొత్తం 41 దేశా లపై ట్రావెల్ బ్యాన్ విధించడానికి సన్నాహాలు ప్రారంభించినట్లు స మాచారం.
ఈ లిస్ట్ లో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, సిరియా, ఇత ర దేశాలు ఉన్నాయి. వార్తా సంస్థ రాయిటర్స్ నివేదిక ప్రకారం ట్రంప్ సర్కార్ మొత్తం 41 దేశాలతో మూ డు జాబితాలను సిద్ధం చేసిందని తెలిపింది. మొదటి జాబితాలో 10 దేశాలు చేర్చారు.ఇందులో ఆఫ్ఘని స్తాన్, సిరియా, ఇరాన్, క్యూబా, ఉత్తర కొరియా వంటి దేశాలు ఉ న్నాయి. ఈ దేశాల పౌరులు అమె రికాకు వెళ్లలేరు. వీటన్నింటిపై పూ ర్తి నిషేధం ఉంటుందని సంకేతాలు కనిపిస్తున్నాయి.