Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

The g20 summit was a success: G20శిఖరాగ్ర సమావేశాలు సక్సెస్

-- సదస్సు నిర్వహణపై సభ్యదేశాల సంతృప్తి -- నవంబర్‌ చివరలో జీ20 వర్చువల్‌ భేటీ

G20శిఖరాగ్ర సమావేశాలు సక్సెస్

— సదస్సు నిర్వహణపై సభ్యదేశాల సంతృప్తి
— నవంబర్‌ చివరలో జీ20 వర్చువల్‌ భేటీ

ప్రజా దీవెన/న్యూఢిల్లీ: భారతదేశం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన జీ20 శిఖరాగ్ర సమావేశాలు సక్సెస్ అయ్యాయి. రెండు రోజుల పాటు జరిగిన సమావేశాలు విజయవంతంగా ముగియడంతో సర్వత్ర సంతోషాలు వ్యక్తమవుతున్నాయి. సదస్సు నిర్వహణ తో పాటు తీసుకున్న నిర్ణయాలపై సభ్య దేశాలన్నీ ముక్తకంఠంతో సంతృప్తి వ్యక్తం చేశాయి.

సమావేశాల చివరిరోజు జీ20 తదుపరి అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్​కు అందించిన ప్రధాని మోదీ ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తుకు సంబంధించిన రోడ్‌మ్యాప్‌పై జరుగుతున్న కృషికి జీ20 సదస్సు వేదిక కావటం సంతోషంగా ఉందన్నారు.ఐక్య రాజ్య సమితి సహా అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణల ఆవశ్యకతను ప్రధాని మోదీ మరోసారి జీ20 వేదిక నుంచి ప్రస్తావించడం ఆకట్టుకుంది.

సెప్టెంబర్ 9, 10 తేదీల్లో రెండు రోజులపాటు జరిగిన ఈ సమావేశాల్లో ప్రపంచం ఎదుర్కొంటున్న ఎన్నో సవాళ్ల పరిష్కారం కోసం కలిసికట్టుగా పనిచేయాల్సిన ఆవశ్యకతను సభ్యదేశాలన్నీ అంగీకరించడంతో భారత్‌ అధ్యక్షతన జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు అట్టహాసంగా ముగిసినట్లయ్యింది.

భారత్ అధ్యక్షతన జరిగిన సమావేశాల నిర్వహణ, తీసుకున్న నిర్ణయాలపై సభ్య దేశాలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశాయి. జీ20 డిక్లరేషన్‌పై సభ్యదేశాల నుంచి ఏకాభిప్రాయం సాధించటం ద్వారా భారత్‌ అతి పెద్ద విజయాన్ని అందుకుందని చెప్పవచ్చు.

జీ20 సమావేశాల ముగింపు సందర్భంగా తదుపరి జీ20 అధ్యక్ష బాధ్యతలను ప్రధాని మోదీ బ్రెజిల్‌కు అప్పగించారు. ఈ మేరకు గావెల్‌గా పేర్కొనే చిన్న సుత్తిని బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా డసిల్వాకు అందించడం విశేషం.అనంతరం సదస్సు తీర్మానాలను ప్రధాని మోదీ ప్రకటిస్తూ ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తుకు సంబంధించిన రోడ్‌మ్యాప్‌పై జరుగుతున్న కృషికి జీ20 వేదిక కావటం ఎంతో సంతృప్తినిచ్చిన్నట్లు ముగింపు ప్రసంగంలో తెలిపారు.

పలు కీలకాంశాలపై కూడా జీ20 శిఖరాగ్ర సమావేశాల్లో చర్చించినట్లు వెల్లడించారు. ఈ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలపై ప్రగతి వేగాన్ని సమీక్షించేందుకు నవంబర్‌ చివరలో జీ20 వర్చువల్‌ భేటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.