Bajaj Pulsar N125: వాస్తవినికి పల్సర్ బైక్‌లు (bike) చాలా ఫ్యాషన్‌గా ఉంటాయి. ఈ క్రమంలో పల్సర్ బైక్‌ల అన్ని మోడళ్ల విక్రయాలు భారీగానే ఉన్నాయి. బజాజ్ నుంచి మరో కొత్త పల్సర్ మోడల్ మార్కెట్లోకి విడుదలకు సిద్దంగా ఉంది. ఈ బజాజ్ పల్సర్ N125 మోటార్‌సైకిల్ స్ప్లిట్ సీట్, సైడ్ ఫెయిరింగ్ (Split seat, side fairing) మరియు టెయిల్ సెక్షన్‌లో కొత్త గ్రాఫిక్స్‌తో వినియోగదారులకు అందుబాటులో ఉండబోతున్నట్టు తెలుస్తోంది. బజాజ్ పల్సర్ ద్విచక్ర వాహనాల మార్కెట్లో లేటెస్ట్ క్రేజ్ కాదు. కానీ బజాజ్ ఆటో పల్సర్‌లో విభిన్నమైన మోడళ్లను విడుదల చేస్తోంది.
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ ఆటో త్వరలో భారత మార్కెట్లోకి తమ బజాజ్ పల్సర్ ఎన్125 మోటార్‌సైకిల్‌ను విడుదల చేయనుంది. కొత్త బజాజ్ పల్సన్ ఎన్125 దూకుడు డిజైన్‌తో భారత మార్కెట్లో విడుదల కానుంది. ముందు భాగంలో ప్లాస్టిక్ ట్రిమ్ మరియు LED హెడ్‌లైట్ ఉన్నాయి. బజాజ్ పల్సర్ N125 మోటార్‌సైకిల్ స్ప్లిట్ సీట్, సైడ్ ఫెయిరింగ్ మరియు టెయిల్ సెక్షన్‌లో కొత్త గ్రాఫిక్స్‌తో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. TVS రైడర్ మరియు Hero Xtreme 125R వంటి బైక్‌ల వంటి స్ప్లిట్ సీటును కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది.
అయితే ఈ బైక్ ధర రూ.90,000 నుంచి రూ.1.10 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న పల్సర్ బైక్‌ల కంటే ఇది సరికొత్తగా ఉంటుందని తెలుస్తోంది.