Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BSNL: బిఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్, కొత్త సంవత్సరం సరికొత్త ప్లాన్

ప్రజా దీవెన, హైదరాబాద్: మొబైల్ వినియోగదారులకు కొత్త సంవత్సరం వేళ కంపెనీలు సరికొత్త ఆఫర్లు అందిస్తున్నాయి. అయితే, రీఛార్జ్ ధరలు ఎక్కువగా ఉండ డంతో చాలా మంది ఇతర టెలికాం నెట్‌వర్క్ మారాలనుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా అదే జరుగు తోంది. ఇలాంటి పరిస్థి తులను తమకు అనుకూలంగా మార్చు కునేందుకు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమి టెడ్ సరికొత్త రీఛార్జ్ ప్లాన్లు తీసుకొ స్తోంది. ఈ నూతన సంవత్సరం సందర్భంగా తమ నెట్‌వర్క్ యూ జర్లకు ఓ బంపర్ ఆఫర్ తీసుకొ చ్చింది. నెలకే రూ.300 పైన వసూలు చేస్తున్న ఈ రోజుల్లో కేవలం రూ.277కే 60 రోజుల వ్యాలిటీడీ ప్యాక్ తీసుకొచ్చింది.

రూ.277తో రీఛార్జ్ చేసుకుంటే అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ రావడంతో పాటు 120 జీబీ హై స్పీడ్ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వారు రోజుకు గరిష్ఠంగా 2జీబీ డేటా వినియోగించుకోవచ్చు. అంటే 60 రోజులకు 120 జీబీ వస్తుంది. అయితే, ఈ ఆఫర్ జనవరి 16, 2025 వరకే అందుబాటులో ఉంటుంది. ఆలోపు రీఛార్జ్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ప్లాన్ వర్తిస్తుంది. ఆ తర్వాత అందుబాటులో ఉండకపోవచ్చు. న్యూ ఇయర్ సందర్బంగా ఈ ప్రత్యేక ప్లాన్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్ వేదికగా ఓ ట్వీట్ చేసింది బీఎస్ఎన్ఎల్.

ఎక్కువ డేటాతో ఈ పండగల సీజన్ మరింత సంతోషకరంగా మారనుంది. రూ. 277తో రీఛార్జ్ చేసుకుని 120జీబీ పొందండి. 60 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ఆఫర్ జనవరి 16, 2025 వరకు అందుబాటులో ఉంటుంది’ అని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది. రోజు వారీ డేటా పరిమితి ముగిసిన తర్వాత 40కేబీపీఎస్‌కి డేటా స్పీడ్ తగ్గించబడుతుందని తెలిపింది.

రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు కొద్ది రోజుల క్రితమే రీఛార్జ్ ప్లాన్ల ధరలను భారీగా పెంచేశాయి. దీంతో చాలా మంది బీఎస్ఎన్ఎల్‌కి మారుతున్నారు. ప్రతి నెలా ప్రభుత్వ నెట్‌వర్క్‌కి మారుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే, ఇప్పటికీ 5జీ కేటగిరీలో జియోనే కస్టమర్లను ఆకర్షించడంలో టాప్‌లో కొనసాగుతోంది. బీఎస్‌ఎన్ఎల్ సిగ్నల్ సరిగా రావట్లేదని, డేటా స్పీడ్ చాలా స్లోగా ఉందనే ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ క్రమంలో కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త కొత్త ప్లాన్లు తీసుకొస్తోంది.