Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Central Government Scheme: ఈ కేంద్ర ప్రభుత్వ పథకం గురించి మీకు తెలుసా..?

Central Government Scheme: ప్రస్తుత రోజులలో పెరుగుతున్న ఖర్చులు కొద్దీ మధ్యతరగతి ప్రజల జీవితం చాలా ఇబ్బంది కరంగా ఉంది . ముఖ్యంగా ఏదైనా అనుకోని అనారోగ్యం వస్తే మాత్రం అనేక సమస్యలు ఎదురుకుంటారు. అనుకోకుండా ఇలాంటి సమస్యల నుంచి పేదలను గట్టెక్కించడానికి కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకాన్ని అమలు చేయడం మొదలు పెట్టింది. ఆయుష్మాన్ భారత్ పథకం పేరుతో పిలిచే ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ-పీఎంఏజేవై) భారతదేశంలోని బలహీన జనాభాకు ఆరోగ్య సంరక్షణ యాక్సెస్‌ను విస్తరించడం మొదలు పెట్టింది. ఇటీవలి ఆయుష్మాన్ కార్డ్(Ayushman Card) అర్హత ప్రమాణాలకు అప్‌డేట్‌లు ఒక పెద్ద సమూహానికి ఆర్థిక రక్షణను అందించడం లక్ష్యంగా ఉంచుకొని ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి రూ.5 లక్షల వరకు వైద్య చికిత్స ఖర్చులు కవర్ చేయడమే లక్ష్యం. ఈ క్రమంలో ఆయుష్మాన్ భారత్ పథకం గురించి మరిన్ని వివరాలను మనం తెలుసుకుందాం

ముందుగా ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆయుష్మాన్ కార్డ్ (Ayushman Card) అందరికి జారీ చేస్తారు. ఈ కార్డు ను వాడుకొని భారతదేశం అంతటా ఎంప్యానెల్ చేయబడిన ఆసుపత్రులలో అర్హత కలిగిన కుటుంబాలు ఉచిత ఆరోగ్య సేవలను మనం పొందవచ్చు. అలాగే ప్రతి కుటుంబానికి సంవత్సరానికి గరిష్టంగా రూ.5 లక్షల వరకు కవరేజీ అందిస్తుంది. అందువల్ల పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్య అవసరాలను తీర్చడంలో ఈ కార్డు (Ayushman Card) కీలక పాత్ర గా వహిస్తుంది అనే చెప్పాలి. అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆయుష్మాన్ పరిధిలోకి వలస కార్మికులను చేర్చింది. వలస కార్మికుల ఆరోగ్య రక్షణకు (Health protection of migrant workers)ఈ ఆయుష్మాన్ భారత్ కార్డులు చాలా బాగా ఉపయోగపడతాయని నిపుణులు అంటున్నారు. అలాగే వలస కార్మికులు ప్రస్తుతం ఉన్న నివాసం నుంచి దరఖాస్తు చేసుకుంటే వారికి ఆయుష్మాన్ కార్డు మంజూరు చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో భూమిలేని కార్మికులు, గ్రామీణ కళాకారులు, ఇతర తక్కువ-ఆదాయ వర్గాలు ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా వైద్య సేవలను చాల సులువుగా పొందవచ్చు.

అలాగే ఆయుష్మాన్ భారత్ పథకంలో వితంతువులు లేదా ఒంటరి మహిళలు, అనాథ పిల్లలతో పాటు వృద్ధులు, వికాలంగులు (Elderly and disabled)కూడా వైద్య సేవలను సులువుగా పొందవచ్చు అని కేంద్రం చెప్పింది. ఈ ఆయుష్మాన్ భారత్ పోర్టల్‌ను సందర్శించి ఆయుష్మాన్ భారత్ కార్డును అంటారు పొందవచ్చు. ముఖ్యంగా ప్రాథమిక వివరాలను నమోదు చేసి అర్హతను తనిఖీ చేయాలి. అనంతరం దరఖాస్తుదారులు దరఖాస్తు చేసుకోవడానికి ఎంప్యానెల్డ్ హాస్పిటల్స్ లేదా కామన్ సర్వీస్ సెంటర్‌లను కాంటాక్ట్ అయ్యారు. అలాగే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడానికి మీకు ఆధార్ కార్డ్ లేదా రేషన్ కార్డ్ వంటి అవసరమైన గుర్తింపు ఉంటే ఆయుష్మాన్ భారత్ కార్డు పొందడం చాల సులువు అవుతుంది.