Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Dewali Sale: దీపావళి సేల్ లో దూసుకుపోతున్న యాపిల్..?

Dewali Sale: తాజగా ఆపిల్ తన కస్టమర్లను ఆకట్టుకోవడానికి దీపావళి పండుగ సందర్భంగా అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. ఇప్పటికే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (Amazon is the Great Indian Festival) మరియు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ (Flipkart Big Billion Days)సేల్‌లు జరుగుతున్న నేపథ్యంలో, ఆపిల్ కూడా తనదైన శైలిలో ఆఫర్లను ప్రకటించింది.

ఏయే ఉత్పత్తులపై ఆఫర్లు ఉన్నాయో చూద్దామా మరి.. ఐఫోన్ 15ని కొనుగోలు చేసే వారికి బీట్స్ సోలో బడ్స్ ఉచితంగా లభిస్తున్నాయి. ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ తర్వాత ఐఫోన్ 15 ధర రూ.10,000 తగ్గింది. ఈ క్రమంలో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్ మరియు ప్రామాణిక ఐప్యాడ్‌లపై రూ.2,500 నుండి రూ.6,000 వరకు తగ్గింపులు లభిస్తున్నాయి.అలాగే యాపిల్ వాచ్ అల్ట్రా, సిరీస్ 10 మరియు ఎస్ఈ1లపై రూ.2,000 నుండి రూ.6,000 వరకు తగ్గింపులు లభిస్తున్నాయి. ఎయిర్‌పాడ్స్ ప్రో, ఎయిర్‌పాడ్స్ 4 (AirPods Pro, AirPods 4) మరియు ఎయిర్‌పాడ్స్ మ్యాక్స్‌పై రూ.1,500 నుండి రూ.4,000 వరకు తగ్గింపులు లభిస్తున్నాయి. మ్యాక్‌బుక్ ఎయిర్ ఎం3 ఈ మోడల్‌పై రూ.10,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది.

ఈ ఆఫర్లు అన్ని కూడా ఆపిల్ ఇండియా వెబ్‌సైట్‌లో మరియు ముంబైలోని యాపిల్ బీకేసీ, న్యూఢిల్లీలోని యాపిల్ సాకెట్‌ వంటి ఆఫ్‌లైన్ స్టోర్‌లలో అందుబాటులో ఉన్నాయి అని కంపెనీ వారు తెలియచేసారు. ఇంకా ఎందుకు ఆలస్యం? మీ కలల ఆపిల్ ఉత్పత్తిని ఇప్పుడే కొనుగోలు చేసి ఆనందించండి..