Google Pixel 9 Pro: మన భారతదేశంలో గూగుల్ పిక్సెల్ 9 (Google Pixel 9 Pro)ప్రో ఫోల్డ్ సేల్ మొదలు పెట్టిందా సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ ఫోన్ సెప్టెంబర్ 4న ఇండియన్ మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చింది. అలాగే ఈ గూగుల్ బ్రాండ్ ఈ హ్యాండ్‌సెట్‌ను పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో ఎక్స్‌ఎల్‌తో కూడా ప్రారంభించింది. ఇది కంపెనీ రెండవ, గూగుల్ భారతదేశంలో మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ప్రారంభమైంది. ఇందులో అనేక AI ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇది చాలా ప్రత్యేకమైనది. ఇది కాకుండా ఫోన్‌లో 16GB RAM అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ టెన్సర్ G4 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది భద్రత కోసం ప్రత్యేక చిప్‌సెట్‌ను కలిగి ఉండడం విశేక్ష్యం.
ఇక Google Pixel 9 Pro Fold ధర రూ.1,72,999. ఈ ధర 16GB RAM+256GB స్టోరేజ్‌తో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఒకే కాన్ఫిగరేషన్‌లో వస్తుంది. మీరు ఈ హ్యాండ్‌సెట్‌ను ఫ్లిప్‌కార్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్ (Flipkart, Chroma, Reliance Digital) నుండి యూజర్స్ కొనవచ్చు. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులపై వినియోగదారులు రూ.10,000 తగ్గింపును పొందుతున్నారు. దీనితో పాటు రూ.13,500 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా గూగుల్ అందిస్తోంది. ఈ ఆఫర్‌ను మీరు ఏదైనా ఫోన్‌ని ఎక్స్ఛేంజ్ కూడా చేయచ్చు. మీరు ఈ హ్యాండ్‌సెట్‌ని EMIలో కూడా కొనుగోలు కూడా చేసుకోవచ్చు.
అసలు ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ (Specifications) విషయానికి వస్తే.. పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ 6.3-అంగుళాల యాక్చువా కవర్ డిస్‌ప్లే, 8-అంగుళాల సూపర్ యాక్చువా మెయిన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్క్రీన్ గరిష్ట బ్రైట్‌నెస్ 2700 నిట్స్. డిస్‌ప్లై (Display)120Hz రిఫ్రెష్ రేట్ మద్దతుతో వస్తుంది. ఇది 16GB RAM, 256GB స్టోరేజీని కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14తో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ కంపెనీ త్వరలో ఆండ్రాయిడ్ 15కి అప్‌డేట్ కూడా చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ 7 సంవత్సరాల పాటు ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్‌లను కూడా ఇస్తుంది. హ్యాండ్‌సెట్ టెన్సర్ G4 ప్రాసెసర్‌పై పనిచేయడంతో పాటు, ట్రిపుల్ రియర్ కెమెరా (Triple rear camera) సెటప్ ఉంది. అలాగే ప్రైమరీ కెమెరా 48MP. ఇది కాకుండా, 10.5MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ (Ultra wide angle lens), 10.8MP టెలిఫోటో లెన్స్ అందుబాటులో కూడా ఉన్నాయి. అలాగే ముందు భాగంలో కవర్ స్క్రీన్, మెయిన్ స్క్రీన్ రెండింటిలోనూ 10MP సెల్ఫీ కెమెరాను కూడా ఏర్పాటు చేశారు.