Income Tax: దేశ ప్రజలు అంత ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన కేంద్ర బడ్జెట్ (Central Budget)ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల పార్లమెంటులో ప్రవేశ పెట్టిన సంగతి అందరికి విదితమే. అలాగే దేశ ప్రగతికి అనుగుణంగా వివిధ రంగాలకు కేటాయింపులు కూడా జరిపారు. అంతే కాకుండా వివిధ వర్గాలకు రాయితీలు అందించారు. దానిలో భాగంగా పన్ను చెల్లింపు దారులకు కూాడా చాలా ప్రయోజనాలను అందించారు. అయితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ కొత్త పన్ను విధానంలో మినహాయింపు పరిమితి కూడా పెంచారు. దీనితో పన్ను చెల్లించేవారికి ముందు కంటే మరింత ప్రయోజనం ఎక్కువగా కలుగుతుంది. అయితే తమకు వచ్చే ఆదాయానికి అనుగుణంగా చెల్లింపుదారులు నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది.
ఇక పాత, కొత్త విధానాలలో (In old and new approaches) ఏ పద్దతి ద్వారా ఆదాయపు పన్ను చెల్లించాలనే విషయంకి వస్తే .. పన్ను చెల్లింపుదారులు నిర్ణయం తీసుకోవాలి. ఏ విధానంలో చెల్లిస్తే ప్రయోజనాలు కలుగుతాయో ముందు మనం తెలుసుకోవలి. వాస్తవికి మీకు వస్తున్న ఆదాయానికి అనుగుణంగా ప్రణాళిక రూపొందించాలి. కేంద్ర బడ్జెట్ లో చేసిన మార్పులను అనుసరించి పాత, కొత్త విధానాలలో దేనిని ఎంచుకోవాలో తెలుసుకుందామా మరి. వాస్తవానికి మనం సంపాదిస్తున్న ఆదాయం తక్కువగా ఉంటే మనం కొత్త పన్ను విధానం వల్ల బాగా ప్రయోజనలు కలుగుతుంది. ఇక కొత్త పన్ను విధానంలో (new tax) స్టాండర్డ్ డిడక్షన్ రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెరిగింది. ఇక మీరు గృహ రుణ వడ్డీపై రూ. 2 లక్షల వరకు తగ్గింపును క్లెయిమ్ చేయకుంటే లేదా ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ)కు అర్హత పొందకపోతే కొత్త సరళీకృత పన్ను వ్యవస్థకు మారడం మంచిది. ఇక కొత్త పన్ను విధానంలో లెక్కింపు విషయానికి వస్తే ..3 లక్షల రూపాయల వరకు ఎలాంటి పన్ను కట్టనక్కర్లేదు. 3 నుంచి 7 లక్షల వరకూ 5 శాతం, 7 నుంచి 10 లక్షల వరకూ పది శాతం, 10 నుంచి 12 లక్షల వరకూ 15 శాాతం, 12 నుంచి 15 లక్షల వరకూ 20 శాతం, 15 లక్షలకు పైబడి 30 శాతం విదిస్తారట.
ఇక మన ఆదాయం (income) ఎక్కువగా వచ్చే వారికి పాత పన్ను విధానం ప్రయోజనకరంగా ఉంటుందని పన్ను నిపుణులు తెల్పుతున్నారు. ఉదాహరణకు రూ. 3,93,750 కంటే ఎక్కువ తగ్గింపులను క్లెయిమ్ చేసే రూ. 11 లక్షల ఆదాయం కలిగిన జీతం పొందిన ఉద్యోగికి పాత పన్ను విధానంలో మరింత ఆదా చేసే అవకాశం కూడా ఉంది.. ఇక పాత పన్ను విధానం ఆరోగ్య బీమా ప్రీమియాలు, పిల్లల స్కూల్ ఫీజులు, సెక్షన్ 80 సీ కింద పెట్టుబడులు, గృహ రుణ వడ్డీ, ఇంటి అద్దెపై(School fees, investments under Section 80C, home loan interest, house rent) పన్ను మినహాయింపులను క్లెయిమ్ కూడా చేసుకోవచ్చు. వీటికి ఆదాయపు పన్ను చట్టం ప్రకారం అనుమతి లభిస్తుంది. కాబట్టి మీ ఆదాయం ఎక్కువగా ఉంటే పాత పన్ను విధానాన్ని ఎంపిక చేసుకోవడం మంచిది. ఇక పాత, కొత్త పన్ను విధానాలు రెండూ కూడా మంచివి. తమకు వచ్చే ఆదాయానికి అనుగుణంగా పన్ను చెల్లింపుదారులు ఎంచుకోవాలి. ఇక పన్ను (tax)చెల్లింపుదారులకు రూ.75 వేల డిడిక్షన్ తో పాటు ఎన్ పీఎస్, ఆరోగ్య బీమా ప్రీమియాలకు మాత్రమే మినహాయింపు ఉన్నటు తెలుస్తుంది.we