Kia Seltos: మన దేశంలో కియా (Kia )కంపెనీ కార్లకు చాలా డిమాండ్ ఉన్న సంగతి అందరికి తెలిసిందే. ఎప్పటి కప్పుడు ఈ కంపెనీ విడుదల చేసే వాహనాల కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. వాస్తవానికి కియా(Kia) లేదా కియా మోటార్ కార్పొరేషన్ అనేది దక్షిణ కొరియాకి చెందిన సంస్థ. అయినప్పటికీ మన దేశంలో మాత్రం మంచి ఆదరణ పొందింది. కియా కంపెనీ తన ఖాతాదారులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. సెల్టోస్ కారుపై రూ.60 వేల ప్రయోజనం అందిస్తున్నట్టు తెలియచేసింది.
వాస్తవానికి భారతీయ మార్కెట్ (indian market) లోకి కియా (Kia) కంపెనీ వచ్చి ఐదేళ్ల పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఐదేళ్ల వార్షికోత్సవం కూడా జరుపుకొంది. ఈ క్రమంలో సెల్టోస్ కారుపై రూ. 60 వేల ప్రయోజనాలు, ఐదేళ్ల వారెంటీ ఉంటుందని కియా తెలిపింది. అయితే అవి ఏమిటో స్పష్టంగా తెలియజేయలేదు. అధీకృత డీలర్లను అడిగి ఖాతాదారులు తెలుసుకోవాలి.
ఇటీవల కియా నుంచి విడుదలైన ప్రీమియ ఎస్ యూవీలలో (Premium SUV) సెల్టోస్ బాగా సక్సెస్ అయ్యింది. భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ కూడా పొందింది. అందుకే కియా ఐదేళ్ల వేడుకలలో భాగంగా ఈ కారుపై ప్రయోజనాలు అందజేస్తున్నట్టు సమాచారం. కియా సెల్టోస్ కారు ధర రూ. 10.90 లక్షల నుంచి రూ. 20.37 లక్షల వరకూ ఉంది. అలాగే టెక్ లైన్, జీటీ లైన్, ఎక్స్ లైన్ (Tech Line, GT Line, X Line) అనే మూడు రకాల ట్రిమ్ లలో అందుబాటులో ఉంటుంది. ఇంకా ఈ మోడల్ కు సంబంధించి పది రకాల వేరియంట్లు ఉన్నాయి. కియా కంపెనీ ఈ నెలలో ‘ఎక్స్‌చేంజ్ యువర్ కార్’ అనే అవకాశం కల్పించింది. కొత్త కియా కస్టమర్లు ఈ ఆన్‌లైన్ ఛానెల్‌ని ఉపయోగించి తమ ఎగ్జిటింగ్ కార్ల విలువను అంచనా వేయడానికి కూడా బాగా ఉంటుంది.
2023లో కియా (kia)కంపెనీ ఒక ముఖ్యమైన అప్ డేట్ చేసింది. 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ను కొత్త 1.5 లీటర్ కు మార్చింది. దాని నుంచి 158 బీహెచ్పీ, 253 ఎన్ఎమ్ టార్క్ విడుదలవుతుంది. ఇది కారుకు మరింత శక్తిని అందిస్తుంది. అదే సమయంలో 1.5 లీటర్ డీజిల్, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్లు మారలేదు. ఈ రెండు ఇంజిన్లూ 115 బీహెచ్ పీ గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తాయి సమాచారం.
2019లో భారతీయ మార్కెట్లోకి సెల్టోస్ మిడ్ సైజ్ ఎస్‌యూవీని లాంచ్ చేయడంతో కియా అడుగులు పెట్టింది. సోనెట్ సబ్ కాంపాక్ట్ ఎస్ యూవీతో (Sonnet Subcompact SUV)పాటు క్రాస్ ఓవర్ వంటి ఇతర మోడళ్లను కూడా మార్కెట్ లోకి వచ్చాయి. అయినా వాటన్నింటిలో సెల్టోస్ అత్యంత ప్రజాదరణ పొందిన కారుగా గుర్తింపు పొందింది. కార్నివాల్ ప్రీమియం ఎంపీవీ ఈ సంవత్సరం తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అలాగే కియా కంపెనీ మన దేశంలో ఈవీ6 ఆల్-ఎలక్ట్రిక్ మోడల్‌ను కూడా మార్కెట్లో ఉంచింది.