Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

NEW RULES: సెప్టెంబర్ 1 నుండి న్యూ రూల్స్

NEW RULES: తాజగా కేంద్ర ప్రభుత్వం స్పామ్ కాల్స్ ,ఫ్రాడ్ కాల్స్ (Spam calls, fraud calls)పై కఠిన చర్యలు తీసుకునేందుకు ముందుకు వచ్చింది. అందుకొరకు ప్రభుత్వ సంస్థ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) మొబైల్ నెట్‌వర్క్‌లకు సంబంధించి కొత్త నిబంధనలను ప్రవేశ పెట్టబోతోంది. ఈ రూల్స్ సెప్టెంబర్ 1, 2024 నుండి దేశవ్యాప్తంగా వర్తిస్తాయి. ఈ నిబంధనల అమలు తర్వాత సాధారణ వినియోగదారులు అవాంఛిత కాల్‌ల నుండి విముక్తి సులువుగా పొందవచ్చు.

ఆ కొత్త నియమాలు ఏమిట అంటే ..మనం మన మొబైల్ నంబర్ నుండి టెలిమార్కెటింగ్ చేస్తే, మీ మొబైల్ నంబర్ రెండేళ్లపాటు బ్లాక్ లిస్ట్ చేయబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ టెలికాం మంత్రిత్వ శాఖ టెలిమార్కెటర్ల కోసం కొత్త మొబైల్ నంబర్ సిరీస్‌ను (SERIES)విడుదల చేయడమే. ఇక నుంచి ఆర్థిక మోసాలను నిరోధించేందుకు టెలికాం కమ్యూనికేషన్ శాఖ కొత్త 160 నంబర్ సిరీస్‌ను కూడా విడుదల చేసారు. అందుకే ఈ పరిస్థితిలో ఇప్పుడు బ్యాంకింగ్ రంగం, బీమా రంగం తమ ప్రమోషనల్ కాల్స్ లేదా మెసేజ్‌లను వినియోగదారులకు అదే 160 నంబర్ మొబైల్ నంబర్ సిరీస్ ద్వారా కూడా చేయవచ్చు.

ఈ క్రమంలో కొత్త నిబంధనలు (NEW RULES) అమల్లోకి వచ్చిన తర్వాత అవాంఛిత కాల్స్, మెసేజ్‌ల సమస్యకు పరిష్కారం లభిస్తుందని అందరు భావిస్తున్నారు. ఎందుకంటే కొత్త నియమం స్వయంచాలకంగా రూపొందించబడే కాల్‌లు, సందేశాలను కూడా కలిగి ఉంటుంది. వీటిని రోబోటిక్ కాల్‌లు, సందేశాలు అని కూడా పిలుస్తారు. సెప్టెంబర్ 1 నుంచి ఇలాంటి కాల్స్, మెసేజ్‌లను నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టంగా తెలియ చేసింది.

అలాగే టెలికమ్యూనికేషన్ శాఖ గణాంకాల ప్రకారం, గత మూడు నెలల్లో ఈ విధంగా సిమ్ కార్డులను దుర్వినియోగం చేస్తూ వినియోగదారులకు పది వేల మోసపూరిత సందేశాలు (MESSAGES)కూడా వచ్చాయి. మీకు కూడా అలాంటి సందేశాన్ని స్వీకరించినట్లయితే మీరు వెంటనే దానిని నివేదించవచ్చు. ఎవరైనా మీకు మోసానికి సంబంధించిన సందేశాన్ని పంపినా లేదా 10 అంకెల మొబైల్ నంబర్ నుండి మీకు కాల్ చేసినా, మీరు దానిని సంచార్ సతి పోర్టల్‌లో (PORTAL) నివేదిక ఇచ్చేలాగా అన్ని ఏర్పాట్లు చేసారు. అలాగే ఈ 10 అంకెల మొబైల్ నంబర్ నుండి మోసపూరిత సందేశం వచ్చినట్లయితే మనం నేరుగా హెల్ప్‌లైన్ ద్వారా కూడా 1909కి నివేదించవచ్చు.