Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

October 1 New Rules: అక్టోబర్‌ 1 నుంచి న్యూ రూల్స్ ఇవే..!

October 1 New Rules: ప్రతి నెల ప్రారంభం లో అనేక మార్పులు జరుగుతూనే ఉంటాయి. అచ్చం అలాగే అక్టోబర్ 1 నుండి దేశంలో చాలా పెద్ద మార్పులు రాబోతున్నాయి.అవి ఏమిటంటే.. వీటిలో ఎల్‌పిజి సిలిండర్ ధర నుండి క్రెడిట్ కార్డ్‌లు, సుకన్య సమృద్ధి, పిపిఎఫ్ ఖాతాల నియమాలలో మార్పుల వరకు అన్నీ కూడా ఈ లిస్ట్ లో ఉన్నాయి. ఈ లిస్టులో ముందుగా చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల మొదటి తేదీన ఎల్‌పీజీ సిలిండర్ ధరలను మారుస్తూనే ఉంటాయి. అలాగే సవరించిన ధరలను అక్టోబర్ 1, 2024 ఉదయం 6 గంటల నుండి జారీ అవచు. ఈ మధ్య కాలంలో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరల్లో అనేక మార్పులు కనిపిస్తున్నా.. 14 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండటం లేద్దని తెలుస్తుంది. మరి అక్టోబర్‌ 1న ఎలాంటి మార్పులు వస్తాయేమో చూడాలి.

అలాగే దేశవ్యాప్తంగా నెల మొదటి తేదీన ఎల్‌పీజీ సిలిండర్ ధరలలో మార్పుతో పాటు, చమురు మార్కెటింగ్ కంపెనీలు కూడా ఎయిర్ టర్బైన్ ఇంధనం (ATF), సీఎన్‌జీ-పీఎన్‌జీ ధరలను కూడా సవరిస్తుంది. వాటి కొత్త ధరలను కూడా అక్టోబర్ 1, 2024న తెలియ చేయనున్నది. ఈ లిస్టులో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కి (HDFC) సంబంధించినది విషయం కూడా ఉంది. మీరు కూడా హెచ్‌డీఎప్‌సీ బ్యాంక్ కస్టమర్ అయితే, కొన్ని క్రెడిట్ కార్డ్‌ల కోసం లాయల్టీ ప్రోగ్రామ్ మార్చారు. ఈ కొత్త నియమాలు అన్ని కూడా అక్టోబర్ 1, 2024 నుండి వర్తిస్తాయి. తదనుగుణంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ SmartBuy ప్లాట్‌ఫారమ్‌లో యాపిల్‌ ఉత్పత్తులకు రివార్డ్ పాయింట్‌ల రిడీమ్‌ను క్యాలెండర్ త్రైమాసికంలో ఒక ఉత్పత్తికి పరిమితం కూడా చేసినటు తెలుస్తుంది.

ఈ లిస్టులో ముఖ్యంగా కుమార్తెల కోసం కేంద్ర ప్రభుత్వం (Central Govt)అమలు చేస్తున్న సుకన్య సమృద్ధి యోజన పథకానికి సంబంధించి ఒక పెద్ద మార్పు వచ్చినట్లు సమాచారం . ఈ మార్పు కూడా అక్టోబర్ 1, 2024 నుండి అమలు అవ్వబోతుంది. ఈ మార్పు ప్రకారం కుమార్తెల చట్టబద్ధమైన సంరక్షకులు మాత్రమే మొదటి తేదీ నుండి ఈ ఖాతాలను నిర్వహిస్తారు. కొత్త నిబంధన ప్రకారం, ఒక కుమార్తె సుకన్య సమృద్ది ఖాతాను ఆమెకు చట్టబద్ధమైన సంరక్షకుడు కాని వ్యక్తి తెరిచినట్లయితే, ఆమె ఈ ఖాతాను సహజ తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకుడికి బదిలీ చేయాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో ఆ ఖాతాను మూసివేయవచ్చు అవి అధికారులు తెలపారు. ఈ మార్పులు అన్ని కూడా అందరు గుర్తు పెట్టుకోండి.