OFFERS: తాజగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయినా అమెజాన్ సెప్టెంబర్ 27వ తేదీ నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను ప్రారంబిస్తున్నటు తెలియచేసింది. అయితే అంతలోపే స్మార్ట్‌వాచ్‌లపై (smart watch) ఎర్లీ డీల్స్‌ను ఉండబోతున్నాయు. ఇందులో భాగంగా ఎంపిక చేసిన కొన్ని ఫోన్‌లపై ఏకంగా 90 శాతం వరకు డిస్కౌంట్స్‌ను ఇస్తున్నారు. వాస్తవానికి అమెజాన్‌లో లభిస్తున్న అలాంటి కొన్ని బెస్ట్ డీల్స్‌కు సంబంధించిన వివరాలు ఏవిటంటే..
ముందుగా ఈ లిస్టులో బోట్ వేవ్ సిగ్మా 3 (boAt Wave Sigma 3 Smart Watch)స్మార్ట్ వాచ్ అసలు ధర రూ. 8999కాగా ఏకంగా 83 శాతం దాక డిస్కౌంట్ ఇస్తున్నారు. దీంతో ఈ వాచ్‌ను రూ. 1499కే సొంతం చేసుకోవచ్చు. ఇందులో 700కిపైగా మోడ్స్‌ను కూడా అందించారు. అలాగే ఇందులో హార్ట్రేట్ మానిటరింగ్, స్లీప్ మానిటరింగ్ వంటి హెల్త్ ట్రాకింగ్ ఫీచర్స్ (Health tracking features like heart rate monitoring, sleep monitoring) బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.
అలాగే అమెజాన్‌లో లభిస్తోన్న బెస్ట్ డీల్స్‌లో ఇదీ ఒకటి. ప్రముఖ వాచ్ తయారీ సంస్థ ఫాస్ట్రాక్‌కు చెందిన ఫాస్ట్రాక్ లిమిట్‌లెస్ Fs1 వాచ్‌పై (Fastrack Limitless Fs1) ఏకంగా 72 శాతం దాక డిస్కౌంట్ లభిస్తోంది. ఇక ఈ వాచ్ అసలు ధర రూ. 5995కాగా 72 శాతం డిస్కౌంట్‌తో రూ. 1699కే మనం పొందవచ్చు. ఇక ఈ వాచ్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో మల్టీస్పోర్ట్, యాక్టివిటీ ట్రాకర్, ఫోన్ కాల్, స్ట్రెస్ ట్రాకింగ్ వంటి ఫీచర్లను మనం పొందవచ్చు. ఇక అధునాతన ఫీచర్లతో కూడిన ఫైర్-బోల్ట్ ఫీనిక్స్ అల్ట్రా లగ్జరీ స్మార్ట్‌వాచ్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ వాచ్ అసలు ధర రూ. 12,499కాగా ఏకంగా 86 శాతం డిస్కౌంట్‌తో రూ. 1799కే లభిస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే ఈ వాచ్‌లో 1.39 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను అందించారు. 180 వాట్స్ పవర్‌తో కూడిన బ్యాటరీని ఇందులో వాడారు.
ఈ లిస్టులో మరొక స్మార్ట్ వాచ్ నాయిస్ పల్స్ 2 మాక్స్ స్మార్ట్‌వాచ్ (Noise Pulse 2 Max Smartwatch) దీని అసలు ధర రూ. 5999కాగా 77 శాతం డిస్కౌంట్‌తో రూ. 1399కి మనం పొందవచ్చు.ఈ వాచ్ ఫీచర్ల విషయానికొస్తే ఈ వాచ్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి సపోర్ట్ కూడా ఉంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 10 రోజులు నాన్‌స్టాప్‌గా పనిచేస్తుంది. 15 వాట్స్ బ్యాటరీని ఇందులో వాడారు. ఇక ఈ లిస్టులో నాయిస్ ట్విస్ట్ గో బ్లూటూత్ వాచ్ కూడా ఉంది ఇది కూడా 1599 మనం పొందవచ్చు.స్మార్ట్ వాచ్ కొనాలి అనుకునే వారికీ ఇది ఒక మంది అవకాశం అనే చెప్పాలి.