OLA: ప్రస్తుత రోజులలో మన ఇండియన్ EV స్కూటర్ల మార్కెట్లో చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకొస్తూ కొనుగోలుదారులకు అనేక ఆప్షన్స్ ఇస్తూ ఉంటారు. అలాగే ప్రజలు కూడా ఎక్కువగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఇష్టం చూపుతున్నారు ఈ స్కూటర్లు ఉండే డిమాండ్ వల్ల ఓలా నంబర్ 1 కంపెనీగా మార్కెట్ అది లో ఉంది. ప్రస్తుతం పండుగ సీజన్ అవవడంతో వెహికల్స్ హాట్ కేకుల్లా సేల్ అవుతున్నాయి. ఇదే అదునుగా భావించిన ఓలా కంపెనీ ఈవీల సేల్స్ పెంచుకునే క్రమంలో “బిగ్గెస్ట్ ఓలా సీజన్ సేల్ క్యాంపెయిన్” సేల్ మొదలు పెట్టింది . ఇందులో భాగంగా ఇప్పుడు కళ్లు చెదిరే ఆఫర్లతో ‘బాస్ 72-అవర్ రష్’ ఆఫర్ ను ప్రవేశ పెట్టింది . ఈ ఆఫర్లో భాగంగా ఓలా S1 స్కూటర్‌ను కేవలం రూ.50వేలలోపే కస్టమర్లులు పొందవచ్చు. ఇంకా ఈ సేల్‌లో చాలా బెనిఫిట్స్ అందిస్తున్నారు. అవేవో చూద్దాం..
బాస్ 72-అవర్ రష్ ఆఫర్ సమయంలో అక్టోబర్ 10, 11, 12 తేదీల్లో ఓలా S1 X 2kWh మోడల్‌ను కేవలం రూ.49,999కే కొనుగోలు చేయవచ్చు అని కంపెనీ వారు తెలిపారు. కానీ ఈ ఆఫర్ కేవలం మూడు రోజులకు మాత్రమే ఉంటుంది . ప్రతి రోజు లిమిటెడ్ స్కూటర్లు మాత్రమే ఈ ధరకు అందుబాటులో ఉంటాయి. అలాగే ఓలా S1 ప్రో మోడల్‌పై రూ.25,000 వరకు డిస్కౌంట్‌ను కూడా అందుకోవచ్చు. అంతేకాకుండా, ఓల్డ్ వెహికల్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.5,000 ఎక్స్ట్రా బోనస్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్లో భాగంగా, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, సాఫ్ట్వేర్ అప్గ్రేడ్లు, ఛార్జింగ్ క్రెడిట్లు వంటి రూ.25,000 వరకు విలువైన ప్రయోజనాలను కూడా మనం పొందవచ్చు.
అలాగే బాస్ 72-అవర్ రష్లో భాగంగా ఓలా కస్టమర్ల బ్యాటరీకి 8 సంవత్సరాలు లేదా 80,000 కి.మీ వరకు ఉచిత వారంటీని కూడా పొందవచ్చు. దీని విలువ రూ.7,000. కొన్ని క్రెడిట్ కార్డులతో EMI తీసుకుంటే రూ.5,000 వరకు ఫైనాన్స్ ఆఫర్ లభిస్తుంది. అలానే మూవ్ఓఎస్+ (MoveOS+) అనే లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌ను ఫ్రీగా యాక్సెస్ చేయవచ్చు. మిగతా సమయాల్లో దీని విలువ రూ.6,000. ఈ మూడు రోజుల సమయంలో ఓలా స్కూటర్లు కొన్నవారికి రూ.7,000 వరకు ఫ్రీ చార్జింగ్ క్రెడిట్లు కూడా మనం పొందవచ్చు.
ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ అందుబాటులోకి తెచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్లన్నీ S1 సిరీస్‌కి చెందినవే. ఈ సిరీస్‌లో మొత్తం ఆరు రకాల స్కూటర్లు ఉన్నాయి. వీటిలో రైడ్ రేంజ్ ఆధారంగా మనకి నచ్చిన స్కూటర్‌ను మనం ఎంపిక చేసుకోవచ్చు. ప్రీమియం మోడళ్లలో S1 ప్రో బెస్ట్ స్కూటర్ గా నిలుస్తోంది. ఈ మోడల్ చాలా ఫీచర్లు అందిస్తుంది. దీని ధర రూ.1,34,999. S1 ఎయిర్ S1 ప్రో కంటే కొంచెం తక్కువ ధరకు లభిస్తుంది. దీని ధర రూ.1,07,499.
అలాగే మాస్ మార్కెట్ మోడళ్లలో S1 X 2 kWh మోడల్ బాగా హిట్ అయ్యింది అని తెలుస్తోంది . దీని ధర రూ74,999. మరో చీప్ మోడల్ S1 X 3 kWh. ఇది 2 kWh మోడల్ కంటే కొంచెం ఎక్కువ రేంజ్‌ను ఇస్తుంది. దీని ధర రూ.87,999. S1 X 4 kWh ఈ మోడల్ మూడు మోడళ్లలో అత్యధిక రేంజ్‌ను ఇస్తుంది. దీని ధర రూ.1,01,999 గా ఉంది.