Smart Scooters: ప్రస్తుతం ఫోన్లే కాదు, స్కూటర్లు, బైక్‌లు కూడా ‘స్మార్ట్’గా మారుతున్న మార్కెట్ లో మనం ఉన్నాం ఆటో కంపెనీలు ఇప్పుడు అలాంటి మోడళ్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకోని రావాలనే ఆలచనలో అనేక మోడల్స్ ను ప్రవేశపెట్టారు. అవి కేవలం ఒకటి లేదా రెండు కాదు, డ్రైవింగ్ (Driving)చేసేటప్పుడు మనకి చాలా సహాయపడే అనేక ఉపయోగకరమైన అనేక ఫీచర్లు ఉన్నాయి. మెయిన్ గా బ్లూటూత్ కనెక్టివిటీ, డిజిటల్ డిస్‌ప్లే, నావిగేషన్ సపోర్ట్ వంటి ఫీచర్లను పొందే ఐదు స్కూటర్లు, మోటార్‌సైకిళ్ల గురించి మనం ఇప్పడూ చూద్దాం.
సుజుకి అవెనిస్ రేస్ ఎడిషన్: ఇందులో బ్లూటూత్ (Bluetooth) కనెక్టివిటీతో పాటు, సుజుకి కంపెనీ నుండి ఈ స్కూటర్‌లో మనకి 125 సిసి ఇంజిన్, నావిగేషన్ డిస్‌ప్లే, స్పీడ్ అలర్ట్, కాల్, ఎస్ఎంఎస్, వాట్సాప్ అలర్ట్, మిస్డ్ కాల్ అలర్ట్‌లను కూడా ఉంది . ఈ స్కూటర్ ధర వచ్చి రూ. 92,800 ఉంది.
సుజుకి యాక్సెస్ 125: అలాగే ఇందులో టర్న్ బై టర్న్ నావిగేషన్ సపోర్ట్‌తో వస్తున్న ఈ సుజుకి స్కూటర్‌లో 125 సిసి ఇంజన్, డిజిటల్ డిస్‌ప్లే, కాల్స్, ఎస్ఎంఎస్ అలర్ట్‌లు వంటి ఫీచర్లు ఉంటాయి. ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 79,899 నుండి రూ. 90,500 వరకు ఉంటుంది అని కంపెనీ వారు తెలిపారు.
యమహా ఫాసినో 125: ఈ స్కూటర్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ ఉంది. దానితో పాటు మీరు స్కూటర్ డిస్‌ప్లేలో కాల్‌లు, ఎస్‌ఎంఎస్‌లు కూడా వస్తాయి. అంతే కాకుండా ఫోన్ బ్యాటరీ స్టేటస్, లాస్ట్ పార్కింగ్ లొకేషన్ వంటి ఫీచర్లు కూడా డిజిటల్ డిస్‌ప్లేలో మార్కెట్ లో మనకి అందుబాటులో ఉంటాయి. ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 79,900 (ఎక్స్-షోరూమ్) నుండి రూ. 91,430 వరకు ఉంటుంది అని కంపెనీ వారు తెలిపారు.
TVS Ntorq 125 రేస్ ఎడిషన్: ఇక టీవీఎస్ మోటార్ కంపెనీకి చెందిన ఈ స్కూటర్‌లో డిజిటల్ డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ లభిస్తుంది. అలాగే ఈ స్కూటర్‌లో 60 కంటే ఎక్కువ ఫీచర్లు కలిగి ఉండడం విశేషం. ఇందులో మెయిన్ గా ఇన్‌కమింగ్ కాల్ అలర్ట్, ఎస్‌ఎంఎస్ అలర్ట్, మిస్డ్ కాల్ అలర్ట్, నావిగేషన్ అసిస్ట్, ఇంజన్ టెంపరేచర్ ఇండికేటర్, ఫోన్ బ్యాటరీ స్టేటస్, లాస్ట్ పార్క్ లొకేషన్ అసిస్ట్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ఇక ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 86,841 నుండి మొదలు అవుతుంది.
TVS జూపిటర్: TVS మోటార్ స్కూటర్‌లో కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉంటాయి. ఇది రూ.73,700 (ఎక్స్-షోరూమ్ ధర) ప్రారంభ ధరతో మార్కెట్ లో రాబోతుంది.