Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజన..ఆ వచ్చే నెల 1వ తేదీ నుంచి కొత్త రూల్స్

Sukanya Samriddhi Yojana: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: మీరు సుకన్య సమృద్ది యోజన (Sukanya Samriddhi Yojana) పథకం, జాతీయ పొదుపు పథకం(NSP), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) వంటి పథకాల్లో పొదుపు చేస్తున్నారా..అయితే మీరు ఇవి విషయం తప్పకుండా తెలుసు కోవాలి.కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యం లోని చిన్నమొత్తాల పొదుపు పథకాలకు సంబంధించి కొత్త రూల్స్ తీసుకొచ్చి కేంద్ర ఆర్థిక శాఖ. ఈ మూడు పథకాలకు సంబంధించిన ఆరు కొత్త నిబంధ నలను అక్టోబర్ 1,2024 నుంచి అమలు చేయనుంది.

పోస్టాఫీసుల ద్వారా నేషనల్ సేవింగ్స్ స్కీమ్స్ (NSP), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్( PPF) వంటి పధకాల్లో పొదుపు చేస్తున్నట్లయితే.. ఈ ఖాతాలను క్రమబద్దీకరించే పనిలో పడింది కేంద్ర ఆర్థిక శాఖ.. ఇందుకోసం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.. ఈ నియమాలు అక్టోబర్ 1, 2024 నుంచి అమలులోకి రానున్నాయి. ఖాతా ఓపెనింగ్ లలో జరిగిన పొరపాట్లను సవరించి, సరిదిద్దడానికి ఈ రూల్స్ రూపొందించినట్లు ఆర్థికశాఖ తెలిపింది. ఆ పొరపాట్లు ఏంటో తెలుసుకుందాం..

ఏప్రిల్ 2, 1990 ముందు తెరవబడిన NSS- 87ఖాతాలు

ఏప్రిల్ 2, 1990 ముందు తెరవబడిన NSS- 87ఖాతాలు ప్రస్తుత స్కీమ్ రేటులో వడ్డీని పొందుతుంది. మరోవైపు రెండవ ఖాతా ప్రస్తుత పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతా (POSA) రేటుతో పాటు బ్యాలెన్స్‌పై 2% పొందుతుంది. అక్టోబర్ 1, 2024 నుంచి ప్రారంభమయ్యే కొత్త నియమం ప్రకారం రెండు ఖాతాలకు 0శాతం వడ్డీ లభిస్తుంది.

NSS-87 ఖాతాలు ఏప్రిల్ 2, 1990 తర్వాత తెరవబడిన ఖాతాల్లో మొదటి ఖాతా ప్రస్తుత స్కీమ్ రేటులో వడ్డీని పొందుతుంది. రెండవ ఖాతా ప్రస్తుత POSA రేటులో వడ్డీని పొందుతుంది. ముఖ్యంగా, రెండు ఖాతాలకు అక్టోబర్ 1, 2024 నుండి 0% వడ్డీ లభిస్తుంది.

మైనర్ పేరుతో తెరవబడిన పిపిఎఫ్ ఖాతాలకు సంబంధించి..

కొత్త నిబంధనల ప్రకారం.. మైనర్‌కు 18 ఏళ్లు వచ్చే వరకు POSA వడ్డీ రేటు వర్తించబడుతుంది. ముఖ్యంగా మెచ్యూరిటీ మైనర్ 18వ పుట్టినరోజు నుంచి లెక్కించబడుతుంది.

ఒకటి కంటే ఎక్కువ PPF ఖాతాలుంటే..

డిపాజిట్లు వార్షిక పరిమితిలోపు ఉంటే.. ప్రాథమిక ఖాతా పథకం రేటుపై వడ్డీని పొందుతుంది. ఏదైనా అదనపు ఖాతాల నుంచి బ్యాలెన్స్ ప్రాథమిక ఖాతాలో విలీనం చేయబడుతుంది. ఏదైనా అదనపు మొత్తాలు వడ్డీలేకుండా తిరిగి ఇవ్వబడతాయి. అదనంగా రెండు కంటే ఎక్కువ ఖాతాలు ప్రారంభ తేదీ నుంచి ఇప్పటివరకు వడ్డీ (INTRSET) ఉండదు.

సుకన్య సమృద్ధి ఖాతాలు

సుకన్య సమృద్ధి ఖాతాలు తెరిచిన సంరక్షుల విషయంలో కొత్త నిబంధన ప్రకారం.. చట్టబద్దమైన సంరక్షకులు కానివారు అంటే ఉదా: తాతలు తెరిచిన ఖాతాలు తప్పనిసరిగా చట్టపరమైన సంరక్షకులు లేదా సహజ తల్లిదండ్రులకు సంరక్షకత్వాన్ని బదిలి చేయాల్సి ఉంటుంది. స్కీమ్ మార్గదర్శకాలను ఉల్లంఘించిన రెండు కంటే ఎక్కువ ఖాతాలు తెరిచినట్లయితే అదనపు ఖాతాలు క్లోజ్ చేయబడతాయి.