Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

UPI Payments: యూపీఐ వినియోగదారులకు శుభ వార్త..?

UPI Payments: ప్రస్తుత కాలంలో ఉన్న టెక్నాలజీ తో ప్రతి ఒక్కరూ కూడా లావాదేవీల కోసం ఆన్‌లైన్ ప్రక్రియను వాడుతూ ఉన్నారు. ఈ టెక్నాలజీ ద్వారా మనం ఎప్పుడైనా, ఎక్కడైనా ఇంట్లో కూర్చొని డబ్బు లావాదేవీలు చాల సులభంగా చేసుకోవచ్చు. దీన్ని మరింత సౌకర్యవంతంగా చేయడానికి UPI (Unified Payments Interface) అందుబాటులో ఉన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే UPI అన్ని డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ లకు కనెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇటివల UPI ద్వారా లావాదేవీలు (upi payments) చేయడానికి పరిమితి ఉండేది. కానీ, దీనిని ఆగస్ట్ 2024లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) రూ. 5 లక్షల వరకు పెంచుతున్నట్లు తెలియచేసింది. దీనితో NPCI పన్ను చెల్లింపు దారులు సెప్టెంబర్ 16, 2024 నుంచి UPI ద్వారా రూ. 5 లక్షల వరకు చెల్లింపులు చేసుకోవచ్చు. అయితే కేవలం పన్ను చెల్లింపులే కాదు, కొత్త UPI పరిమితి ప్రకారం వినియోగదారులు విద్య, ఆసుపత్రులు, RBI రిటైల్ డైరెక్ట్ స్కీమ్, IPO లకు సంబంధించిన లావాదేవీలను కూడా నేరుగా చేసుకునే అవకాశాం కూడా కల్పించింది.

ఇది ఇలా ఉండగా సాధారణంగా UPI లావాదేవీ పరిమితి రూ. 1 లక్ష వరకు ఉండేది. కానీ, బ్యాంకులు కూడా సొంత పరిమితులను సెట్ చేసుకునే హక్కును కలిగి ఉంటాయి. ఉదాహరణకు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్ తమ కస్టమర్‌ లకు రూ. 1 లక్ష వరకు యూపీఐ లావాదేవీలు చేయడానికి అనుమతిస్తాయి. అలహాబాద్ బ్యాంక్ కస్టమర్లకు UPI లావాదేవీ పరిమితి రూ. 25,000 మాత్రమే. ఇది కాకుండా Google Pay, Phone Pe, Paytm మొదలైన UPI యాప్‌లు కూడా వాటి సొంత పరిమితిని కలిగి ఉంటాయి. బీమా చెల్లింపులు రూ.2 లక్షల వరకు, ఇతర మూల ధన సంబంధిత UPI లావాదేవీలు కూడా చేసుకునే విదంగా ఉంది ప్రస్తుతానికి..

అయితే UPI లేదా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ ఫేస్ అనేది భారత దేశంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ద్వారా అభివృద్ధి చేయబడిన డిజిటల్ చెల్లింపు వ్యవస్థ. ఈ వ్యవస్థ ద్వారా ఆర్థిక లావాదేవీ లను సురక్షితమైన పద్ధతిలో అనుమతిస్తుంది. UPI సిస్టమ్ అన్ని వేళల (24 గంటలు, 7 రోజులు) అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా లావాదేవీలు చేసుకోవచ్చు. UPI లావాదేవీ లకు సురక్షితమైన PIN (UPI PIN) అవసరం. ఇది మీ ఆర్థిక సమాచారం భద్రతను నిర్ధారిస్తుంది. అలాగే QR కోడ్‌ ద్వారా కూడా UPI చెల్లింపులు చేయవచ్చు. అంతే కాకుండా దీని ద్వారా వ్యక్తి గత లావాదేవీలు, బిల్లు చెల్లింపులు, టాక్సీ ఛార్జీలు, రెస్టారెంట్ బిల్లులు, ఆన్‌లైన్ షాపింగ్, ప్రభుత్వ సేవల చెల్లింపుల చేయడనికి కూడా UPIని చాల సులువుగా చేసుకోవచ్చు..