Xiaomi X Pro QLED Smart TV: ప్రస్తుత రోజులలో ప్రతి ఒక్కరి ఇంట్లో స్మార్ట్ టీవీ వినియోగించడం మనం చూస్తూనే ఉన్నాం. అందుకు తగ్గట్టే స్మార్ట్ టీవీ కంపెనీస్ వారు కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్ లతో , కొత్త టీవీలలో లాంచ్ చేస్తూ ఉన్నారు.ఈ క్రమంలో చైనాకు చెందిన షావోమీ కంపెనీ భారత మార్కెట్లోకి కొత్త టీవీని విడుదల చేసింది.ఈ టీవీకి షావోమీ ఎక్స్ ప్రో క్యూఎల్ఈడీ (Xiaomi X Pro QLED Smart TV) పేరు పెట్టారు. ఆగస్టు 27వ తేదీన ఈ టీవీ లాంచ్ అవ్వబోతున్నట్టు సంస్థ వారు తెలిపారు. ఈ టీవీలు 43 ఇంచెస్, 55 ఇంచెస్, 65 ఇంచెస్‌తో ఉండబోతున్నాయి.
అలాగే ఈ షావోమీ (Xiaomi ) టీవీలో మ్యాజిక అనే ఫీచర్‌ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లకు వైబ్రంట్ కలర్ ఎక్స్పీరియన్స్ పొందే అవకాశం ఉంటుందని సమాచారం. ఈ టీవీ స్క్రీన్ ఫినిషింగ్‌లు అయితే మెటల్లో డిజైన్ చేశారు. అలాగే ఈ షావోమీ టీవీల్లో సినిమాటిక్ ఆడియో ఎక్స్పీరియన్స్ అందించేలా స్పీకర్లను అందించనున్నారు. అలాగే షావోమీ ఎక్స్ ప్రో క్యూఎల్ఈడీ టీవీలు ప్యాచ్ వాల్ ఇంటర్ ఫేస్, గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టంలను కూడా ఆడ్ చేశారు. అంతేకాకుండా షావోమీ టీవీలో 32 జీబీ స్టోరేజ్ కెపాసిటీ ఉండబోతుంది.
ఈ షావోమీ టీవీ ఎమ్ఐ.కామ్‌తో (mi)పాటు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్‌లో (flipkart) వినియోగదారులకు అందుబాటులో ఉండబోతుంది. అయితే ఈ టీవీ ధరకు సంబంధించి కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే ఇవ్వలేదు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఆగస్టు 27వ తేదీన తెలియజేయనున్నారు సంస్థ వారు. ఇదిలా ఉంటే.. షావోమీ గతేడాది షావోమీ.. ఎక్స్ ప్రో పేరుతో స్మార్ట్ టీవీలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో భాగంగా కూడా 40 ఇంచెస్, 50 ఇంచెస్, 55 ఇంచెస్ వేరియంట్స్‌లో మార్కెట్ లో (market)రిలీజ్ చేసారు..