Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

YouTube Premium : యూట్యూబ్‌ లవర్స్‌కి బ్యాడ్ న్యూస్‌..

YouTube Premium: మనం సాధారణంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ముందుగా మనం సంప్రదించేది గూగుల్. అనంతరం వెంటనే యూట్యూబ్ లో వెళ్లి అందుకు సంబంధించిన వీడియోస్ (videos) స్విమ్మింగ్ కోసం వెతకడం మొదలు పెట్టేస్తాము. ప్రతిరోజు కూడా వేల సంఖ్యలో కొత్త కొత్త వీడియోలు అప్లోడ్ అవుతూనే ఉంటాయి. అన్ని రకాల కంటెంట్లకు సంబంధించిన వీడియోలు యూట్యూబ్లో మనం చూడవచ్చు. దీనితో యూట్యూబ్ లో కూడా క్రియేటర్ (creaters) లో బాగానే లాభపడుతూ ఉన్నారు. ఒక్క యూట్యూబ్ తోనే లక్షలాది రూపాయలు కూడా సంపాదించుకుంటున్నారు.

ఈ తరుణంలో యూట్యూబ్ (youtube) మరింత అడ్వాన్స్ సేవల కోసం యూట్యూబ్ ప్రీవియం పేరుతో సరికొత్త ఫ్యూచర్ ను ప్రవేశపెట్టిన సంగతి అందరికీ తెలిసినదే. ఈ యూట్యూబ్ ప్రీమియం (YouTube Premium) యూస్ చేసుకొని ఎక్స్ క్లూజివ్ కంటెంట్ తో పాటు ఎక్కువ క్లారిటీతో కూడిన వీడియోలను యూసర్ చూసే విధంగా అవకాశం కల్పించారు. అయితే తాజాగా ఈ యూట్యూబ్ ప్రీమియం సేవలను వాడుతున్న వారికి యూట్యూబ్ ఒక చేదు వార్త తెలియజేసింది. అది ఏమిటి అంటే ప్రీమియం చార్జీలను పెంచుతున్నట్లు కీలకమైన నయం తీసుకుంది. ఈ కీలక నిర్ణయంతో యూట్యూబ్ ప్రీమియం (YouTube Premium) చార్జీలు ఒక్కసారిగా 200 రూపాయలు పెంచుతున్నట్లు యూట్యూబ్ వారు తెలియజేశారు.

ఇక ప్రెసెంట్ ఉన్న యూట్యూబ్ ప్రీమియం (YouTube Premium) సబ్‌స్క్రిప్షన్‌ను నెలవారీ, 3 నెలలు, 12 నెలల ప్లాన్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. పెరిగిన ధరల వివరాల్లోకి వెళ్తే.. నెలవారీ ప్లాన్ ధర రూ.129 నుంచి రూ.149కి పెరిగింది. అదే సమయంలో విద్యార్థి నెలవారీ ప్లాన్ ధర రూ.79 నుంచి రూ.89కి పెరగడం జరిగింది.అలాగే ఫ్యామిలీ మంత్లీ ప్లాన్ ధరను యూట్యూబ్‌ రూ.189 నుంచి రూ.299కి పెంచింది. వ్యక్తిగత ప్రీపెయిడ్ నెలవారీ ప్లాన్ (plans) ధర రూ.139 నుంచి రూ.159కి పెరిగింది. ఇది కాకుండా 3 నెలల ప్లాన్ ధర రూ.399 నుంచి రూ.459కి పెరిగింది. వార్షిక ప్లాన్‌ల ధరలను కూడా పెంచే ఆలోచనలో ఉన్నటు సమాచారం.