సినిమాIndiaOpinionక్రైంజాతీయంతెలంగాణహైదరాబాద్

Asha Bhosle Death : బిగ్ బ్రేకింగ్, మూగబోయిన గానకోకిల, దశాబ్దాల పాటు మంత్రముగ్ధులను చేసిన ఆశాభోస్లే అస్తమయం

Asha Bhosle Death : ప్రజా దీవెన, ముంబై: భారత సంగీ త ప్రపంచాన్ని దశాబ్దాల పాటు మంత్ర ముగ్ధులను చేసిన గానకోకిల ఆశాభోస్లే(Asha Bhosle)గళం మూగబోయిం ది. ఇప్పటికైతే నిశ్శబ్దమైంది కానీ ఆమె స్వరంమాత్రం కాలా న్నీ దాటి మార్మోగుతూనే ఉంటుందనడoలో ఎటువంటి సం దేహం లేదు. ఆదివారo ముంబైలో ని బ్రీచ్ క్యాండీ ఆసుప త్రి వెలుపల ఒక వార్త దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. 92 ఏళ్ల వయస్సులో ఆశా భోస్లే భౌతికంగా మన మధ్య లేక పో యినా, ఆమె గానం మాత్రం చిర స్థాయిగా నిలిచిపోయింది. శనివా రం సాయంత్రం తీవ్ర అలసట,ఛాతీ ఇన్ఫెక్షన్‌తో ఆ సుపత్రిలో చేరిన ఆ మె ఆ రాత్రి గుండెపోటుకు గురై అ నం తరం మల్టీ-ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా కన్నుమూశారు.

ఇదిలా ఉండగా ఆమె కుమారుడు ఆనంద్ భోస్లే కన్నీటి కళ్ల తో ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఆమె వెళ్లిపోయింది కానీ ఆ మె స్వరం ఎప్పటికీ మనతోనే ఉంటుందని భావోద్వేగంతో తెలిపారు.సోమవారం ఉదయం 11 గంటలకు ఆమెని వా సంలో చివరి దర్శనానికి అవకాశం కల్పించగా, సాయంత్రం 4 గం టలకు శివాజీ పార్క్‌లో అంతిమ సంస్కారాలు నిర్వ హించనున్నా రు.ఒక చిన్నారి గాత్రంగా ప్రారంభమైన ప్రయా ణo గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నిలిచే స్థాయికి ఎదిగింది.

1943లో ‘చలా చలా నవ బాలా’ తో మొదలైన సంగీత యా త్ర, ‘న యా దౌర్’ వంటి చిత్రాలతో అఖండ గుర్తింపును తె చ్చుకుంది. హిందీ మాత్రమే కాకుండా తెలుగు, తమిళం, బెం గాలీ, మరాఠీ, మలయా ళం, పంజాబీ ఇలా పది కంటే ఎ క్కువ భాషల్లో ఆమె గానం విస్తరిం చింది.భవిష్యత్తులో కూ డా, సంగీతాన్ని ప్రేమించే ప్రతి తరానికి ఆశా భోస్లే ఒక పా ఠ్యాంశం అవుతుంది, ఒక ప్ర మాణం అవుతుంది, ఆమె పా టలు కేవలం వినిపించవు అను భూతి చెందిస్తాయన్నది వా స్తవం.

రాజకీయ నాయకులు, కళాకారు లు, అభిమానులు అంద రూ ఒకే మాట చెబుతున్నారు “లతా తర్వాత నిలిచిన ఆ మహాగాత్రం కూ డా ఇప్పుడు నిశ్శబ్దమైంది, కానీ ఆ నిశ్శబ్దం వెనుక ఎన్నో వేల పాటల ప్రతిధ్వని వినిపిస్తూనే ఉంటుంద ని వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

Back to top button