వాటర్ ఫాల్స్ లో పడి యువకుడి మృతి
ప్రజా దీవెన/పెద్దపల్లి: వాటర్ ఫాల్స్ అంటే అందరికీ అనoదమే కాని అప్పుడప్పుడు అనుకోకుండా అవే కొందరి పట్ల మృత్యుపాశాలుగా మారుతున్నాయి. అదే తరహాలో బుధవారం వాటర్ ఫాల్స్ లో పడి యువకుడు మృతి చెందిన సంఘటన పెద్దపెల్లి జిల్లా సబితం వాటర్ ఫాల్స్ వద్ద చోటుచేసుకుంది. కరీంనగర్ లోని కిసాన్ నగర్ కు చెందిన మానుపాటి వెంకటేష్ స్నేహితులతో కలిసి వాటర్ ఫాల్స్ సందర్శనకు రాగా ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందాడు. వాటర్ ఫాల్స్ వద్ద నీటి ప్రవాహం అధికంగా ఉందని ఎవరు సందర్శనకు రావద్దని పోలీసులు ఎన్ని మార్లు విన్నవించిన ప్రజలు పట్టించుకోవడం లేదు. మృతదేహాన్ని వెలికి తీసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు