ఘోరాతి ఘోరం, విమాన ప్రమాదం లో 181 మంది ప్రయాణికుల కు గాను 179 మంది దుర్మరణం
ప్రజా దీవెన, కొరియా: దక్షిణ కొరి యా విమానం విమానా ప్రమాదం లో ఘోరాతి ఘోరం జరిగిపోయింది. రన్ వే పై విమానం క్రాష్ అయి న దుర్ఘటనలో తాజా సమాచారం మేరకు విమానంలోని 181 మం ది ప్రయాణికులకు గాను 179 మంది దుర్మరణం పాలయ్యారు. దక్షి ణ కొరియాలోని మువాన్ నగరంలో ఆదివారం జెజు ఎయిర్ విమా నం రన్‌వేపై నుండి కంచెను ఢీకొట్టిన సంఘటనలో 181 మంది ప్ర యాణి కుల్లో 179 మంది చనిపోయారని ఆ దేశ ఉన్నతాధికారులు వెల్లడిం చారు.
ఈ ప్రమాదంలో ఇప్పటివ రకు 177 మంది మరణిం చినట్లు అధికా రులు అధికారికంగా నిర్ధా రించారు.జెజు ఎయిర్ ఫ్లైట్ 7C2216, 175 మంది ప్రయాణి కులతో పాటు ఆరుగురు సిబ్బం దితో బ్యాం కాక్ నుండి బయలు దేరిన విమానం ఉదయం 9 గంట లకు (స్థానిక కాలమానం ప్రకారం) ల్యాండ్ అవుతున్నప్పుడు ఈ సంఘటన జరి గింది.గత వారం కజకిస్తాన్‌లోని అక్టౌ సమీపంలో జరిగిన అజర్‌బైజా న్ ఎయిర్‌లైన్ విమాన ప్రమాదంలో 67 మందిలో 38 మంది మర ణించగా మిగతా వారందరూ గాయపడ్డారు.
కాగా దక్షిణ కొరియా విమానా ప్రమాదంలో పలు కీలక అంశాలు అధికా రికంగా వెళ్లడ య్యాయి.జెజు ఎయిర్ ఫ్లైట్ 175 మంది ప్రయాణికులు మరియు 6 మంది సిబ్బందితో థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ నుండి దక్షిణ కొరియాలోని మువాన్‌కు తిరిగి వస్తుండగా, విమానం రన్‌వే నుండి పక్కకు తప్పుకుని, మంట లు చెలరేగడానికి ముందు విమా నాశ్రయంలోని కంచెను ఢీకొన్నట్లు సమాచారం. అదే సమయంలో మంటతో చుట్టుముట్టిన విమానం నుండి నల్లటి పొగ దట్టమైన దిండ్లు వెలువడుతున్న దృశ్యాలను స్థానిక టీవీ స్టేషన్లు ప్రసారం చేశాయి కూడా.
Airplane crash